ఆంధ్రప్రదేశ్‌

సదావర్తి భూముల అమ్మకం సమంజసమే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 11: గుంటూరు జిల్లాలోని సదావర్తి భూముల అమ్మకాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సమర్థించుకుంది. ఈ భూముల అమ్మకాన్ని సవాలు చేస్తూ అఖిల భారత బ్రాహ్మణ సమాఖ్య దాఖలు చేసిన పిటిషన్‌ను తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలిప్ బి బోసలే, జస్టిస్ పి నవీన్‌రావులతో కూడిన డివిజన్ బెంచ్ విచారించింది. సదావర్తి భూముల అమ్మకంలో ఎలాంటి అక్రమాలు జరగలేదని, అమ్మకాలను వీడియో రికార్డు చేశామని, అత్యధికంగా చెల్లించిన బిడ్డర్లకు భూమిని అమ్మినట్టు ఎపి అడ్వకేట్ జనరల్ దొమ్మలపాటి శ్రీనివాస్ వాదించారు. తక్కువ ధరకు భూములను కట్టబెట్టారన్న పిటిషనర్ వాదనను అడ్వకేట్ జనరల్ తోసిపుచ్చారు. తమిళనాడులోని తాలంబూరు, నవులూరు, పోడూరు గ్రామాల్లోని భూముల ధర ఎకరా ఐదు కోట్లు ఉంటుందని పిటిషనర్ పేర్కొనడాన్ని తీవ్రంగా దుయ్యబట్టిన ఎజి అంతమేరకు చెల్లిస్తే ఆ భూములను ఆయనకే అందజేస్తామని పేర్కొన్నారు.
సిసి కెమరాలకు ఎంత ఖర్చు చేస్తారు?
పదో తరగతి పరీక్షల్లో సామూహిక కాపీయింగ్‌ను నిరోధించేందుకు ఎం చర్యలు తీసుకుంటున్నారో, పరీక్ష కేంద్రాల్లో సిసి కెమరాల ఏర్పాటుకు ఎంత డబ్బు కేటాయించారో కోర్టు ముందుంచాలని హైకోర్టు తెలంగాణ, ఆంధ్రా ప్రభుత్వాలను ఆదేశించింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లోటు బడ్జెట్‌తో ఉందని, 36 కోట్ల రూపాయిలు భారం భరించే స్థితి లేదని ఆ రాష్ట్ర కౌన్సిల్ న్యాయమూర్తులకు వివరించారు. అయితే 36 కోట్లు అంత భారం కాదని, అసలు ఎంత వెచ్చించదల్చుకున్నారో వివరించాలని హైకోర్టు ఇరు రాష్ట్రాలనూ ఆదేశించింది.