ఆంధ్రప్రదేశ్‌

గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచే 2019 హజ్‌యాత్ర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, అక్టోబర్ 4: ముస్లింల సంక్షేమం, అభివృద్ధిపై ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేక దృష్టి పెట్టారని ప్రభుత్వ విప్, హజ్ కమిటీ సభ్యులు ఎంఏ షరీఫ్ తెలిపారు. 2019 హజ్‌యాత్ర విజయవాడ ఎయిర్‌పోర్డు నుంచి సాధ్యమయ్యేలా ముఖ్యమంత్రి పూర్తి స్థాయిలో చర్యలు తీసుకుంటున్నారన్నారు. గురువారం విజయవాడలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన జిల్లా హజ్ సొసైటీల సన్మాన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం తరపున మైనార్టీల కోసం అమలు చేస్తున్న పథకాలను మైనార్టీలకు పూర్తి స్థాయిలో అందేలా జిల్లా హజ్ కమిటీల సేవలను వినియోగించుకుంటామని ఆయన చెప్పారు. మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, జిల్లా హజ్ సొసైటీలు సంయుక్తంగా పని చేస్తూ ప్రభుత్వ పథకాలకు విస్తృత ప్రచారం కల్పించడానికి ఈ కార్యక్రమంలో కార్యాచరణ ప్రణాళికను రూపొందించారు. హజ్ యాత్రికుల సమస్యల్ని అధిగమించడానికి అనుసరించాల్సిన వ్యూహంపై ఈ సమావేశంలో విస్తృతంగా చర్చించారు.
2019 హజ్ యాత్ర నోటిఫికేషన్ అక్టోబర్ రెండవ వారంలో రానుంది కాబట్టి హజ్ యాత్రకు వెళ్లాలనుకునే వారు వెంటనే పాస్ పోర్ట్ సిద్ధం చేసుకోవాలని హజ్ కమిటీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మహమ్మద్ లియాఖత్ ఆలీ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో హజ్ కమిటీ చైర్మన్ మోమిన్ అహ్మద్, మైనార్టీ సంక్షేమశాఖ అదనపు కార్యదర్శి ఉషాకుమారి, హజ్ కమిటీ సభ్యులు వౌలానా ఇలియాస్, వౌలానా రఫీ, హాజీ హసన్ బాషాతో పాట హజ్ కమిటీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మహమ్మద్ లియాఖత్ ఆలీ, ఎంఎఫ్‌సీ ఈడీలు పాల్గొన్నారు.