ఆంధ్రప్రదేశ్‌

మెట్రోకు రూపాయి ఇవ్వడానికి చేతులు రావడం లేదా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, అక్టోబర్ 4: బీజేపీ పాలిత రాష్ట్రాల పట్ల ఒకరకంగానూ, ఆంధ్రప్రదేశ్ పట్ల మరోరకంగానూ కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వం పక్షపాత వైఖరిని అవలంబిస్తోందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పంచుమర్తి అనూరాధ మండిపడ్డారు. భోబోపాల్, ఇండోర్ మెట్రోలకు రూ.7 వేల కోట్లను కేంద్రం సాయం చేయగా విజయవాడ, విశాఖ మెట్రో రైళ్లు నిర్మాణానికి రూపాయి ఇవ్వడానికి చేతులు రావడం లేదా అంటూ ప్రశ్నించారు. గురువారం టీడీపీ రాష్ట్ర పార్టీ కార్యాలయం ఎన్‌టిఆర్ భవన్‌లో ఏర్పాటుచేసిన విలేఖర్ల సమావేశంలో పంచుమర్తి అనూరాధ మాట్లాడుతూ మన రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయంపై నరేంద్రమోదీని నిలదీసే ధైర్యం ఏపీ బీజేపీ నేతలకు లేదని ఎద్దేవా చేశారు. మధ్యప్రదేశ్ ఎన్నికల్లో లాభం కోసమే భోపాల్, ఇండోర్ మెట్రోలకు అయ్యే ఖర్చులో 7 వేల కోట్లు కేంద్రం భరించాలని మోదీ క్యాబినెట్ బుధవారం నిర్ణయించిందని తెలిపారు. భ సమాన భాగస్వామ్య విధానం కింద కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెరో 20 శాతం నిధులు సమకూర్చి మిగిలిన 60 శాతం నిధులను యూరోపియన్ ఇనె్వస్టిమెంట్ బ్యాంకు నుండి రుణం తీసుకోనున్నాయన్నారు. ఇండోర్ మెట్రో రైలు 31.55 కిలోమీటర్ల నిర్మాణం చేయాల్సి ఉండగా, ఇందుకు 7,500 కోట్ల రూపాయలు వ్యయం అవుతుందని అంచనా వేశారని చెప్పారు. దీనికి కూడా సమాన భాగస్వామ్య విధానం కింద నిధులు ఖర్చు చేస్తాయని, ఆసియా అభివృద్ధి బ్యాంకు, న్యూ డెవలప్‌మెంట్ బ్యాంకు నుంచి రుణం తీసుకోనున్నాయని తెలిపారు. విశాఖ మెట్రో రైలు 3 కారిడార్‌లలో 42 కిలోమీటర్ల మేర నిర్మాణం జరగాల్సి ఉందని, ఇందుకు 8,800 కోట్లు వ్యయం అవుతుందని అంచనా వేశారన్నారు.
దేశంలోనే 2వ పెద్ద మెట్రో ప్రాజెక్టు అని, దీనికి కూడా సమాన భాగస్వామ్య విధానం వర్తింపజేయడానికి కేంద్రానికి ఉన్న అభ్యంతరమేంటని నిలదీశారు. రాజధానిలో భాగమైన విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టుకు 6,769 కోట్లు వ్యయం అవుతుందని అంచనా వేసి ఆ మేరకు క్లియరెన్స్ వచ్చాక కేంద్రం మోకాలడ్డిందని ఆరోపించారు. కొత్త మెట్రో పాలసీ వచ్చిందని పునఃపరిశీలన చేయాలంటూ చెప్పిన కేంద్రం నాలుగు సంవత్సరాలు గడిచినా అతీగతీ లేకుండా ప్రాజెక్టులను అటకెక్కించిందని విరుచుకుపడ్డారు.