ఆంధ్రప్రదేశ్‌

ప్రతి సామాన్యుడికి ప్రగతి ఫలాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూళ్లూరుపేట: ప్రతి సామాన్యుడికి ప్రగతి ఫలాలు అందించడమే భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఉద్దేశ్యమని ఇస్రో మాజీ చైర్మన్ డాక్టర్ కె.రాధాకృష్ణన్ అన్నారు. నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీష్‌ధావన్ అంతరిక్ష కేంద్రం (షార్)లో నిర్వహించిన అంతరిక్ష వారోత్సవాలను (వరల్డ్ స్పేస్ వీక్) గురువారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన షార్ ఉద్యోగులను ఉద్దేశించి మాట్లాడుతూ ఇస్రో విజన్ గురించి తెలియజేసే విధంగా ప్రసంగించారు. ఆధునిక సాంకేతికతను దేశానికి అందించడమే కాకుండా గ్రామాల్లో ఉన్న ప్రతి పౌరుడికి అంతరిక్ష సేవలు అందించే విధంగా ఇస్రో పనిచేస్తుందన్నారు. ఒకప్పుడు షార్ నుంచి చిన్నచిన్న రాకెట్ ప్రయోగాలు జరిగి నేడు భారీ ప్రయోగాలు చేపట్టే స్థాయికి ఎదిగిందంటే అది ఇక్కడ పనిచేసే ఉద్యోగుల సమష్ఠి కృషేనని తెలిపారు. శ్రీహరికోట నుంచి ప్రయోగించిన చంద్రయాన్-1, మంగళయాన్, మార్స్ ఉపగ్రహ ప్రయోగాలు ఇస్రో పుటల్లో లిఖించబడ్డ సువర్ణ అక్షరాలుగా రాధాకృష్ణన్ అభివర్ణించారు. 2019లో ప్రయోగించే చంద్రయాన్-2 ప్రయోగం ఇస్రో సాంకేతిక ప్రతిభ మరింతగా తెలుసుకొనే అవకాశం ఉందన్నారు. ఈ ప్రయోగంలో ముఖ్యమైన లాండర్, రోవర్ పనితీరు చంద్రయాన్-2లో ఆధునిక సాంకేతికతలో భాగమన్నారు. గంటలకు రెండువేల కి.మీ దూరం ఈ లాండర్ పయనించేలా రూపకల్పన చేయనున్నట్లు వెల్లడించారు. అదే విధంగా రోవర్ పనితనం కూడా చంద్రయాన్-2లో ఉంటుందన్నారు. చంద్రయాన్-2తో పాటు మానవసహిత రాకెట్ ప్రయోగం కూడా షార్ సిద్ధమవుతుండడంతో ప్రపంచదేశాల దృష్టి షార్‌వైపు మళ్లిందన్నారు. షార్ డైరెక్టర్ ఎస్.పాండ్యన్ మాట్లాడుతూ కేరళ ఇండోనేషియాలో చోటుచేసుకొన్న తుఫాన్ బీభత్సవంలో ఉపగ్రహాల ద్వారా సేకరించిన ఛాయాచిత్రాలు సాయమందించేందుకు ఎంతో ఉపయోగపడిందన్నారు. విపత్తులు, ప్రమాద సంఘటనలలో సాంకేతిక మేధస్సు మరణాలను అడ్డుకొనేందుకు ఎంతో ఉయోగపడుతుందన్నారు. కమ్యూనికేషన్, రీసోర్స్, జీపీఎస్ సిస్టం ఉపగ్రహాలే ఇందుకు నిదర్శమన్నారు.
సామాన్యుడికి సైతం అంతరిక్షంలో స్పేస్ ఏర్పాటు చేయడమే అంతరిక్ష ప్రయోగాల ఉద్ధేశమని ప్రధాని మోదీ కూడా చెప్పుకొచ్చారని ఈ సందర్భంగా తెలియజేశారు. ముందుగా ఈ కార్యక్రమాన్ని ఎంఆర్ కురుఫ్ ఆడిటోరియంలో జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో షార్ అసోసియేట్ డైరెక్టర్ బద్రీనారాయణ, వెంకట్రామన్, కంట్రోలర్ జేవీ రాజారెడ్డి, గ్రూపుడైరెక్టర్ గోపికృష్ణ, పబ్లికేషన్ అండ్ పబ్లిసిటి అధికారి విశ్వనాధ శర్మ తదితరులు పాల్గొన్నారు.
చిత్రం.. షార్‌లో అంతరిక్ష వారోత్సవాలను ప్రారంభ సభలో ఉద్యోగులను ఉద్దేశించి మాట్లాడుతున్న రాధాకృష్ణన్