ఆంధ్రప్రదేశ్‌

బందరు పోర్టుకు కావాల్సింది 14వేల ఎకరాలే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూలై 11: బందరు పోర్టు నిర్మాణ పనులను వచ్చే ఏడాది ప్రారంభించి 2018 నాటికి ఓడ వచ్చేలా కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తున్నట్లు రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర చెప్పారు. సోమవారం బందరు పోర్టు నిర్మాణంపై మంత్రి తన విజయవాడ క్యాంప్ కార్యాలయంలో విలేఖర్లతో మాట్లాడారు. పోర్టు నిర్మాణంపై ఎలాంటి అపోహలు అవసరం లేదని, ఎట్టి పరిస్థితుల్లోనూ పోర్టు నిర్మాణం జరుగుతుందన్నారు. రాజధాని అమరావతికి ల్యాండ్ పూలింగ్‌లో సేకరించిన విధంగా పోర్టు నిర్మాణానికి భూములు సేకరిస్తామన్నారు. పోర్టు నిర్మాణం కోసం రైతుల నుండి సమీకరించేది 14వేల ఎకరాలేనని మంత్రి స్పష్టం చేశారు. పోర్టు నిర్మాణానికి 4,800 ఎకరాలు, రోడ్లు, రైల్వేలైన్ల నిర్మాణానికి 500 ఎకరాలు మొత్తం 5,300 ఎకరాలు అవసరమవుతుందన్నారు. పోర్టు అనుబంధ పరిశ్రమను నెలకొల్పడం ద్వారా ఇక్కడి రైతులకు మంచి ఉపాధి అవకాశాలు దొరుకుతాయన్నారు. మచిలీపట్నం ఏరియా డెవలప్‌మెంట్ అథారిటీ (మడ) సిఆర్‌డిఏ మాదిరిగా పనిచేసి బందరు పోర్టు అభివృద్ధికి పనిచేస్తుందన్నారు. మడ పరిధిలో 33వేల ఎకరాల్లో అభివృద్ధి ప్రణాళికలు రచిస్తుందన్నారు. వీటిలో 11వేల ఎకరాలు ప్రభుత్వ భూములు, 8వేల ఎకరాలు అసైన్డ్ భూములు, 14వేల ఎకరాలు పట్టా భూములని మంత్రి వివరించారు. రైతుల ప్రమేయం లేకుండా భూములు తీసుకునే అవకాశం లేదని భరోసా ఇచ్చారు. మడ పరిధిలోని 29 గ్రామాల్లో 426 స్క్వేర్ కిలోమీటర్ల పరిధిలో లక్షా 5వేల ఎకరాల భూములున్నాయని వెల్లడించారు. మడ ఆధ్వర్యంలో లక్ష ఎకరాలు లాక్కోబోతున్నట్టు ఎవరైనా నిరూపిస్తే తాను రాజకీయాల నుంచి శాశ్వతంగా వైదొలుగుతానని మంత్రి రవీంద్ర సవాల్ విసిరారు.