ఆంధ్రప్రదేశ్‌

ఆహార పథకాలు సమర్థంగా అమలుకావాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, అక్టోబర్ 6: ప్రభుత్వం అమలుచేస్తున్న ఆహార పథకాలను సమర్థవంతంగా అమలుచేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆదేశించారు. ఉండవల్లి ప్రజావేదికలో రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ జేఆర్ పుష్పరాజ్ ఆధ్వర్యంలో సభ్యులు శనివారం ముఖ్యమంత్రిని మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. కమిషన్ మెంబర్ సెక్రటరీగా జి రవిబాబు నూతనంగా బాధ్యతలు స్వీకరించిన నేపథ్యంలో సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రంలో మహిళలు, పాఠశాల విద్యార్థులు, అంగన్‌వాడీలో చిన్న పిల్ల ఆరోగ్యం మెరుగు కోసం అందిస్తున్న ఆహారంలో నాణ్యతకు ప్రథమ ప్రాధాన్యత ఇస్తున్న విషయాన్ని గుర్తుచేశారు. తరచు రాష్ట్రంలో పర్యటనలు జరుపుతూ రేషన్ దుకాణాలలో నిత్యావసర సరకుల సరఫరా సక్రమంగా, సకాలంలో అందేలా నిఘా ఉంచాలని ముఖ్యమంత్రి సూచించారు. ఫుడ్ కమిషన్ సభ్యులు నాగభక్తుల శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

చిత్రం..ముఖ్యమంత్రిని కలిసిన ఫుడ్ కమిషన్ సభ్యులు