ఆంధ్రప్రదేశ్‌

కవాతు కేక పుట్టించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ(సిటీ), అక్టోబర్ 6: ధవళేశ్వరం బ్యారేజీపై జనసేన పార్టీ నిర్వహించ తలపెట్టిన కవాతుతో పార్టీ సత్తాను దేశవ్యాప్తం చేయాలని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. పార్టీ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే జనబాటకి అందరూ సమష్టిగా సహకరించాలన్నారు. విజయవాడలోని పార్టీ తాత్కాలిక రాష్ట్ర కార్యాలయంలో శనివారం ఆయన గోదావరి జిల్లాల నాయకులు, కార్యక్తలతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ఈనెల 15వ తేదిన నిర్వహించే ధవళేశ్వరం కవాతు ద్వారా దేశం మొత్తం జనసేన పార్టీ గురించే మాట్లాడుకోవాలన్నారు. కవాతు కెవ్వుమనేలా కేక పుట్టించడం కోసం ఏం చేస్తారో చేయాలన్నారు. కవాతుకి అందరూ సమన్వయంతో పనిచేసి విజయవంతం చేయాలన్నారు. జనసేన పార్టీకి తూర్పు గోదావరి జిల్లా ఆయువుపట్టు వంటిదన్నారు. జిల్లాలోని 19 నియోజకర్గాల్లో 20 నుండి 22 రోజుల పాటు పర్యటిస్తానని ప్రకటించారు. పశ్చిమ గోదావరి జిల్లాలో మరో రెండు రోజుల్లో పార్టీ పోరాట యాత్ర పూర్తవుతుందన్నారు. 15వ తేదిన కవాతుతో తూర్పు గోదావరి జిల్లాలో పర్యటన ప్రారంభవౌతుందన్నారు. తూర్పు గోదావరి జిల్లాపై పూర్తిగా దృష్టిసారిస్తానని, ఈ జిల్లా ప్రజలు ఇచ్చే తీర్పు రాష్ట్రం మొత్తాన్ని ప్రభావితం చేస్తుందన్నారు. పార్టీలో కష్టపడి పని చేసే వారిని, గుర్తించి వారిని తప్పకుండా ముందుకు తీసుకు వెళ్తానని అభయమిచ్చారు. జనసేన పార్టీకి తూర్పు గోదావరి జిల్లాలో చాలా బలముందని, అక్కడ పట్టు సాధించలేకపోతే, ఆ తప్పు నాయకులదే అవుతుందని అభిప్రాయపడ్డారు. పార్టీలో కోటరీలు కట్టే విధానానికి తాను పూర్తి వ్యతిరేకమన్నారు. ఎంతో విశాల దృక్ఫథంతో, చిత్తశుద్దితో ముందుకు వెళ్తున్న సందర్భంలో కొంత మంది చిన్న చిన్న ఆలోచనలతో ఉంటే ఏలా అని ప్రశ్నించారు. రాష్ట్రంలోలో పితాని బాలకృష్ణకు మాత్రమే జనసేన పార్టీ టిక్కెట్టును ఖరారు చేశామన్నారు. మరెవరికీ అసెంబ్లీ సీటు ఖరారు చేయలేదన్నారు. పార్టీ అసెంబ్లీ సీట్లు ఇస్తామని ఎవరైనా చెబితే వారిని నమ్మవద్దని సూచించారు. సీట్ల కేటాయింపుకు సంబంధించి ప్రత్యేకంగా ఒక కమిటీ ఉందన్నారు. సీట్ల కేటాయింపులో పారదర్శకత ఉంటుందన్నారు. ఇతర పార్టీలతో పోలిస్తే పార్టీ నిర్మాణం కాస్త ఆలస్యమైనా, పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తున్నట్లు పవన్ చెప్పారు. సంయమనం, సహనం ఎంతో అవసరమన్నారు. ఇప్పుడు వేసిన కమిటీ పూర్తి స్థాయి కమిటీ కాదని, ఈకమిటీతో పాటు తనతో సహా ఎవరికి ఎటువంటి అధికారులు లేవన్నారు. పదవుల రూపంలో పార్టీ బాధ్యతలను మాత్రమే తీసుకున్నట్లు చెప్పారు. పార్టీ పదవి అంటే బాధ్యత మాత్రమేనన్నారు. కమిటీల నియామకంలో ఏవైనా లోపాలు ఉంటే పార్టీ పెద్దలకి తెలపాలని సూచించారు. మరికొద్ది రోజుల్లో విజయవాడలో పార్టీ నూతన కార్యాలయం ప్రారంభిస్తామని ప్రకటించారు. పరిమిత వనరులతో, ఎవరూ తోడ్పాటు అందించకున్నా, సీనియర్ రాజకీయ నాయకుల సహకారం లేకున్నా, పార్టీని ముందుకి తీసుకు వెళ్తున్నట్లు గుర్తు చేశారు. ఇప్పటికిప్పుడు కొంత మంది పార్టీలో చేరేందుకు సిద్దంగా ఉన్నారన్నారు. జనసేన పార్టీపై అందరికి నమ్మకం పెరిగిందన్నారు. ప్రశ్నిస్తాం అంటే ప్రశ్నిస్తూనే ఉంటామని అర్థం కాదన్న ఆయన ప్రశ్నించడం ద్వారా అధికారాన్ని చేజిక్కించుకుంటామనే అర్థమన్నారు. బలమైన మార్పు తేవాలన్నది జనసేన పార్టీ లక్ష్యమన్నారు. పంచాయితీ ఎన్నికలు జరగకపోవడం వలన వెనుకబడిన వర్గాలు అధికారానికి దూరమయ్యారని అభిప్రాయపడ్డారు. అధికారాన్ని కొద్ది మంది చేతుల్లో పెట్టుకునే లక్ష్యంతోనే ఇలా చేస్తున్నట్లు చెప్పారు. ఇది ప్రజాస్వామ్యాన్ని అవహేళన చేయడమేనన్నారు. జనసేన ఆలోచనా విధానం అధికార వికేంద్రీకరణ అని వివరించారు. పంచాయితీల్ని బలోపేతం చేయాలన్నారు. అధికారం అనేది మార్పులో భాగం కావాలి గానీ అంతిమ లక్ష్యం కాకూడదన్నారు. కొత్త ఓటర్ల నమోదుని ప్రతి కార్యకర్త ఓ బాధ్యతగా తీసుకోవాలన్నారు. జనబాట కార్యక్రమాన్ని ముందుకి తీసుకువెళ్లాలని సూచించారు. జనబాట కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని, జనబాటతో తూర్పు గోదావరి జిల్లా మిగిలిన జిల్లాలకి తలమానికంగా నిలవాలన్నారు.