ఆంధ్రప్రదేశ్‌

చట్టం, రాజ్యాంగమే మనకు బాస్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (క్రైం): ‘ప్రపంచం నిద్రపోవాలంటే పోలీసు మేల్కోవాలి. నిరంతరం సమాజం కోసం పనిచేసే పోలీసు అంటే నాకు ఇష్టం’ అని ఉప రాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు అన్నారు. అయితే పోలీసులు ఎలాంటి పరిస్థితుల్లోనూ ఒత్తిళ్ళకు లొంగకూడదని, రాజకీయ ఒత్తిళ్ళకు అసలే తలొగ్గవద్దని, చట్టం, రాజ్యాంగమే మనకు బాస్ అని ఉద్ఘాటించారు. పోలీసులు ప్రజల స్నేహితులనే భావన వారిలో కలిగించే బాధ్యత అందరిపై ఉందన్నారు. అధికార పక్షానికే పనిచేస్తామనే ఆలోచన తీసుకురాకుండా నిష్పాక్షికంగా వ్యవహరించాలని సూచించారు. సామాజిక సేవలోనూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని పోలీసు ప్రధాన కార్యాలయంలో ఆదివారం వనం-మనం కార్యక్రమంలో పాల్గొన్న ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఆరో బెటాలియన్ ఆవరణలో మొక్కలు నాటారు. అనంతరం ఇక్కడ ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయనకు రాష్ట్రంలోని పలువురు ఐపీఎస్ అధికారులు, జిల్లాల ఎస్పీలు, ఉన్నతాధికారులు పేరుపేరున తమను పరిచయం చేసుకున్నారు. తర్వాత రాష్ట్ర పోలీసు శాఖ పనితీరు, సాధించిన ప్రగతిని డీజీపీ ఆర్పీ ఠాకూర్ ఉప రాష్ట్రపతి కి పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించారు. ఈసందర్భంగా వెంకయ్య నాయుడు ఐపీఎస్ అధికారులను ఉద్దేశించి మాట్లాడుతూ పరిపాలనలో మార్పు రావాలంటే రాజకీయ మార్పు కావాలన్నారు. తాము ప్రజలకు స్నేహితులమనే భావన వారిలో తీసుకురావాలని, ఆ బాధ్యతను పోలీసులు గుర్తెరగాలన్నారు. మన యూనిఫారం, వస్తధ్రారణ మాత్రమే కాదని, మన ఆచరణ ముఖ్యమని, ఆచరణను బట్టే ప్రజలు అంచనా వేస్తారన్నారు. బాగా పనిచేసి వ్యవస్థకు మంచిపేరు తేవాలని, ప్రజలను సన్మార్గంలో పెట్టేలా సరైన దారి చూపించాల్సిన బాధ్యత పోలీసులదేనన్నారు. స్మార్ట్ విజన్, వినూత్న ఆలోచన కలిగి ఉండాలని దిశా నిర్దేశం చేశారు.
ఇటీవల విశాఖ జిల్లా లివిటిపుట్టు గ్రామంలో ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేలపై నక్సల్స్ హత్యాకాండను వెంకయ్య ప్రస్తావిస్తూ ఈ ఘటన పోలీసులకు సవాలేనని అన్నారు. దేశంలో తీవ్రవాదాన్ని అణచడంలో ఆంధ్రప్రదేశ్ పోలీసుకు మంచిపేరుందని కితాబిచ్చారు. సంఘవిద్రోహ శక్తులకు భయం కలిగించేలా పోలీసులు వ్యవహరించాల్సిన అవశ్యకత ఉందన్నారు. బుల్లెట్ ద్వారా అధికారం రాదని, బ్యాలెట్ ద్వారానే ఏదైనా సాధ్యపడుతుందన్నారు.
ప్రకృతిని నిర్లక్ష్యం చేస్తే కోపిస్తుంది
వనం-మనం కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటిన ఉప రాష్ట్రపతి దాని ప్రాముఖ్యతను వివరించారు. ప్రతిఒక్కరూ మొక్కలు నాటడమే కాకుండా వాటిని పరిరక్షించే బాధ్యత తీసుకోవాలన్నారు. ప్రకృతిని నిర్లక్ష్యం చేస్తే అది మనపై పగ తీర్చుకుంటుందన్నారు. ప్రకృతితో కలిసి జీవించాలని, ప్రేమించాలని సూచించారు.
అవార్డు గ్రహీతలు వీరే
అనంతరం వనం-మనం కార్యక్రమంలో పోలీసు శాఖ నుంచి ప్రగతి సాధించి ప్రతిభ చూపిన పలువురికి ఉప రాష్ట్రపతి అవార్డులు ప్రదానం చేశారు. నెల్లూరు జిల్లా వెంకటగిరి ఏపీఎస్పీ తొమ్మిదో బెటాలియన్ అధికారి మోహన్‌ప్రసాద్, కృష్ణా జిల్లా అవనిగడ్డ డీఎస్పీ వి పోతురాజు, పశ్చిమగోదావరి జిల్లా కానిస్టేబుల్ పి సాంబమూర్తి, చిత్తూరు సీఐ ఎస్ యురిషి కేశవ, విజయవాడ ఏసీబీ డీఎస్పీ ఎస్వీవీ ప్రసాద్ అవార్డు అందుకున్నారు. అనంతరం డీజీపీ ఉప రాష్టప్రతికి జ్ఞాపిక అందజేశారు. ఈ సమావేశంలో మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్, పార్లమెంటు సభ్యుడు మాగంటి బాబు, హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఏఆర్ అనూరాధ, ఇంటిలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు, లా అండ్ ఆర్డర్ అదనపు డీజీ హరీష్‌కుమార్ గుప్తా, సీఐడీ అదనపు డీజీ అమిత్‌గార్గ్, ఆర్టీసీ ఎండీ ఎన్వీ సురేంద్రబాబు, ఫైర్ డీజీ సత్యనారాయణ పాల్గొన్నారు.
చిత్రం..పోలీసు అధికారులతో సమావేశంలో మాట్లాడుతున్న ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు