ఆంధ్రప్రదేశ్‌

అయ్యప్ప భక్తుల నిరసన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ, అక్టోబర్ 7: ప్రఖ్యాత పుణ్యక్షేత్రం శబరిమలైలో శ్రీ స్వామి అయ్యప్ప ఆలయ పవిత్రతను కాపాడాలని కోరుతూ వందలాది మంది అయ్యప్ప మాల ధరించిన స్వాములు, భక్తులు తూర్పుగోదావరి జిల్లా కేంద్రం కాకినాడలో ఆదివారం నిరసన ప్రదర్శన నిర్వహించారు. నగరంలోని పోలీస్ రిజర్వ్డ్ లైన్‌లోని శ్రీ అయ్యప్ప ఆలయం నుండి ప్రారంభమైన ర్యాలీ జగన్నాథపురం వంతెన వరకూ సాగింది. అయ్యప్ప ఆలయ పవిత్రత కాపాడాలని, శబరిమలై ఆచారాలను గౌరవించాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా గురుస్వాములు మాట్లాడుతూ హిందూ మత సంప్రదాయాలను, ఆలయాల ఆచారాలను కాపాడాల్సిన బాధ్యత న్యాయస్థానాలపై ఉందన్నారు. శబరిమలై అయ్యప్ప ఆలయంలో మహిళల ప్రవేశం అంశంపై సుప్రీంకోర్టు తీర్పును పునఃపరిశీలించాలన్నారు. మహిళల్లో చిన్న పిల్లలు, 50 సంవత్సరాలు పైబడిన మహిళలను అయ్యప్ప ఆలయంలోకి అనుమతిస్తున్నారని చెప్పారు. అయ్యప్పకు లింగ వివక్ష లేదన్నారు. స్ర్తిలు రుతుక్రమ సమయంలో ఆలయాన్ని సందర్శించరాదన్న నిబంధన అనాదిగా ఉందని పేర్కొన్నారు. అయ్యప్ప మాల వేసుకుని 40 రోజుల పాటు దీక్ష చేయాల్సి ఉంటుందని చెప్పారు. వయసులో ఉన్న స్ర్తిలు దీక్షకు అర్హులు కారని, ఈ అంశాన్ని పక్కదారి పట్టిస్తూ మొత్తం మహిళలందరినీ అయ్యప్ప దర్శనానికి వెళ్ళనివ్వడం లేదన్న ప్రచారం చేస్తున్నారన్నారు. చిన్న పిల్లల నుండి వృద్ధుల వరకు ఎందరో మహిళలు పెద్ద సంఖ్యలో అయ్యప్పను దర్శించుకుంటున్నారని పేర్కొన్నారు. ఈ వాస్తవాన్ని పక్కన పెట్టి కొందరు కావాలనే అయ్యప్ప ఆలయానికి స్ర్తిలు వెళ్ళకుండా చేస్తున్నారంటూ దేశ అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారన్నారు. ఆలయ సంప్రదాయం, ఆచారాలను దృష్టిలో ఉంచుకుని వయసులో ఉన్న స్ర్తిలను ఆలయ ప్రవేశం చేయకుండా చూడాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. ప్రదర్శనలో వేలు స్వామి, దత్తాత్రేయ స్వామి, పద్మనాభస్వామి పాల్గొన్నారు.