ఆంధ్రప్రదేశ్‌

చిరు వ్యాపారులకూ బ్యాంకులు రుణాలివ్వాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, అక్టోబర్ 7: చిరు వ్యాపారులకు ముద్రా పథకం కింద హామీల్లేని రుణాలందించి వారి జీవన ప్రమాణాలు పెరగడానికి అర్బన్ బ్యాంకులు దోహదపడాలని ఏపీ రాష్ట్ర మార్కెటింగ్, గిడ్డంగులు, సహకార, మత్య్స శాఖ మంత్రి సిహెచ్ ఆదినారాయణరెడ్డి అన్నారు. రాష్ట్రంలోని అన్ని అర్బన్ బ్యాంకుల్లో పోస్టుల భర్తీకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ ఇస్తామని మంత్రి పేర్కొన్నారు. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని ఆర్యాపురం కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంకు 100 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆదివారం నిర్వహించిన శత వసంతాల వార్షికోత్సవ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ అర్బన్ బ్యాంకుల్లో సిబ్బంది నియామకానికి అడ్డంకులు తొలగిస్తామన్నారు. కడప, జమ్మలమడుగులలో బ్రాంచీలు ఏర్పాటుచేస్తే అవసరమైన స్థలం చూపిస్తామని ఆర్యాపురం బ్యాంకు పాలకవర్గానికి సూచించారు. సహకార వ్యవస్థలో నమ్మకం చాలా ముఖ్యమన్నారు. సహకార బ్యాంకుల పాలకవర్గాలు నిజాయితీగా పని చేసి ప్రజల మన్ననలు పొందాలన్నారు. ఆర్యాపురం అర్బన్ బ్యాంకు రూ.1000 టర్నోవర్‌కు చేరుకోవడం ముదావహమన్నారు. ఈ సందర్భంగా బ్యాంకు పాలకవర్గాన్ని మంత్రి అభినందించారు. రూ.600 కోట్ల డిపాజిట్లు, రూ.400 కోట్ల షేరు ధనం, 16 బ్రాంచిలు, 6 ఏటిఎంలు, 2.50 లక్షల మంది సభ్యులు, 91వేల మంది షేర్ హోల్డర్లు కలిగిన ఆర్యాపురం బ్యాంకు సహకార వ్యవస్థలో స్ఫూర్తిదాయకమైన బ్యాంకు అన్నారు. బంగారం, ఇళ్లపైనే కాకుండా ఇళ్ల పట్టాలపై కూడా అర్బన్ బ్యాంకులు రుణాలు ఇవ్వాలన్నారు. ఇక్కడి గోదావరి పుణ్యమా అని పట్టిసీమ ఎత్తిపోతల పధకం ద్వారా రాయలసీమలో గోదావరి నీళ్ళు తాగుతున్నామని మంత్రి ఆదినారాయణరెడ్డి అన్నారు. బ్యాంకు ఛైర్మన్ చల్లా శంకరావు అధ్యక్షతన జరిగిన ఈ సభలో ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి, మేయర్ పంతం రజనీ శేషసాయి, ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, గుడా ఛైర్మన్ గన్ని కృష్ణ, వివిధ అర్బన్ బ్యాంకుల ఛైర్మన్లు పాల్గొన్నారు. గతంలో పని చేసిన, ఇప్పటి పాలకవర్గ సభ్యులను ఘనంగా సత్కరించారు.

చిత్రం..శత వసంతాల వేడుకల సావనీర్ ఆవిష్కరిస్తున్న మంత్రి ఆదినారాయణ రెడ్డి