ఆంధ్రప్రదేశ్‌

రిజర్వేషన్లపై స్పష్టమైన హామీ ఇచ్చే పార్టీకే మద్దతు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆలమూరు, అక్టోబర్ 7: కాపు రిజర్వేషన్లకు స్పష్టమైన హామీయిచ్చే పార్టీకే తమ మద్దతు ఇస్తామని, అప్పటి వరకూ వేచి చూస్తామని రాష్ట్ర కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం అన్నారు. తూర్పుగోదావరి జిల్లా ఆలమూరు మండలం చెముడులంకలో ఆదివారం ఆయన విలేఖర్లతో మాట్లాడారు. ఇప్పటికే రాష్ట్రంలో ఏడు జిల్లాల్లో పర్యటించి కాపు ఉద్యమ నేతలతో చర్చించామన్నారు. అలాగే గత నెల 25, 26 తేదీల్లో భవిష్యత్తు కార్యాచరణపై విస్తృత స్థాయి సమావేశాలు నిర్వహించామన్నారు. కాపులంతా ఒకే తాటిపై ఉండి, ఏ పార్టీ న్యాయంచేస్తుందో ఆ పార్టీకే మద్దతిస్తారన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గత ఎన్నికల్లో రిజర్వేషన్లపై హామీ ఇచ్చి నెరవేర్చలేదన్నారు. తూతూమంత్రంగా కాపు రిజర్వేషన్ బిల్లును అసెంబ్లీలో ఆమోదించి, పార్లమెంటుకు పంపారన్నారు. ఇందులో అనేక లోపాలున్నాయని, బిల్లును వెనక్కు రప్పించి, సవరణలుచేసి గవర్నర్ ఆమోదంతో రాష్ట్రంలో కాపులకు రిజర్వేషన్లు అమలుచేయాలని ముద్రగడ డిమాండ్ చేశారు. తమిళనాడు రాష్ట్రంలో దివంగత ముఖ్యమంత్రి జయలలిత హయాంలో 69 శాతం రిజర్వేషన్లను గవర్నర్ ఆమోదంతో అమలుచేసిన విషయన్ని గుర్తుచేశారు. రిజర్వేషన్లు 50 శాతం మించకూడదనే నిబంధన సరికాదన్నారు. ఉత్తరాంధ్ర నుంచి గుంటూరు వరకు కాపులుగాను, అక్కడ నుంచి రాయలసీమ వరకూ బలిజలు గాను కాపు రిజర్వేషన్ బిల్లులో పొందుపరచాలన్నారు. రాజ్యాధికారం కోసం అవరమైతే బీసీ, ఎస్సీలను కలుపుకుని కూటమిగా ఏర్పడి ఎన్నికలకు వెళతామన్నారు. బీసీలకు అన్యాయం చేస్తున్నామనే వాదన సరికాదన్నారు. అవసరమైతే బీసీలకు రిజర్వేషన్లు పెంచి కాపులకు రిజర్వేషన్లు అమలుచేయాలని ముద్రగడ సూచించారు. కాపు ఉద్యమం మొదలు నుంచి ఆ ఉద్యమకారులంతా చెక్కుచెదరకుండా ఉన్నారన్నారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో కాపు ఉద్యమం పటిష్టంగా ఉందన్నారు. విలేఖర్ల సమావేశంలో కాపు ఉద్యమ నేతలు ఆకుల రామకృష్ణ, నైనాల హరిశ్చంద్రప్రసాద్, పాటంశెట్టి రవి, గిరజాల బాబ్జీ, తిరుమలశెట్టి శ్రీను తదితరులు పాల్గొన్నారు.

చిత్రం..విలేఖర్లతో మాట్లాడుతున్న ముద్రగడ