ఆంధ్రప్రదేశ్‌

మూర్తికి ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, అక్టోబర్ 7: గీతం విద్యా సంస్థల చైర్మన్, ఎమ్మెల్సీ ఎంవీవీఎస్ మూర్తి అంత్యక్రియలు విశాఖలో ఆదివారం జరిగాయి. మూర్తి పెద్ద కుమారుడు పట్ట్భా రామారావు తండ్రి చితికి నిప్పంటించారు. మూర్తి కుటుంబీకులతోపాటు ముఖ్యమంత్రి చంద్రబాబు సహా పలువురు రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, టీడీపీ నాయకులు, అభిమానులు, గీతం విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అలాస్కాలో రోడ్డు ప్రమాదంలో సోమవారం ఎంవీవీఎస్ మూర్తి మరణించగా, అన్ని లాంఛనాలు పూర్తయిన తరువాత ఆదివారం ఉదయం భౌతికకాయం విశాఖ చేరుకుంది. మూర్తి స్వగృహంలోనూ, రామ్‌నగర్‌లోని పార్టీ కార్యాలయంలో ప్రజల సందర్శనార్ధం మూర్తి భౌతిక కాయాన్ని ఉంచి, మధ్యాహ్నం మూడు గంటలకు అంతిమయాత్ర నిర్వహించారు. రామ్‌నగర్ నుంచి రుషికొండ వరకూ మూర్తి అభిమానులు, టీడీపీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో అంతిమయాత్రలో పాల్గొన్నారు. గీతం విద్యా సంస్థలకు సమీపంలోని ప్రభుత్వ స్థలంలో మూర్తి అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించారు. అంతిమయాత్రలో భాగంగా మూర్తి భౌతికకాయాన్ని గీతం డీమ్డ్ యూనివర్శిటీ లోపలి నుండి వర్శిటీ వెనుక భాగాన అంత్యక్రియలు జరిగే ప్రదేశానికి తీసుకురాగా, విద్యార్థులు, గీతం అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది కన్నీటి పర్యంతమయ్యారు.
పూలతో నింపిన వాహనంలో ఆయన భౌతికకాయాన్ని అంతిమయాత్రలో తీసుకువచ్చారు. అనంతరం బంధువులు, సన్నిహితులు, అభిమానులు అభిమాన నాయకునికి కన్నీటి వీడ్కోలు పలికారు. మూర్తి కుమారులు పట్ట్భా రామారావు, లక్ష్మణరావు, కుమార్తె భారతి, మనుమలు, బంధువులు పాల్గొన్నారు. రాష్ట్ర మంత్రులు చినరాజప్ప, ఎమ్మెల్యే, సినీ హీరో బాలకృష్ణ, నారా లోకేష్, కళా వెంకటరావు, అయ్యన్న పాత్రుడు, గంటా శ్రీనివాసరావు, ఎంపీలు అవంతి శ్రీనివాస్, కె హరిబాబు, గీతం ఛాన్సలర్ ప్రొఫెసర్ కోనేరు రామకృష్ణారావు, వైస్‌ఛాన్సలర్ ప్రొఫెసర్ ఎంఎస్ ప్రసాదరావు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.

చిత్రం..మూర్తి భౌతికకాయాన్ని ఊరేగింపుగా అంత్యక్రియలకు తీసుకువెళ్తున్న దృశ్యం