ఆంధ్రప్రదేశ్‌

కూలిన రెయిలింగ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, జూలై 11: ఆంధ్రప్రదేశ్ సచివాలయం ఫస్ట్ఫో్లర్ రెయిలింగ్ కూలి ముగ్గురు కార్మికులకు తీవ్ర గాయాలయ్యాయి. షాపూర్జీ పల్లోంజీ సంస్థ చేపట్టిన నిర్మాణాల్లో భాగంగా సచివాలయం ఫస్ట్ఫో్లర్‌లో సోమవారం పనులు నిర్వహిస్తున్నారు. అదే సమయంలో ఈదురుగాలులతో కూడిన వర్షం మొదలైంది. వర్షం తాకిడికి ముఖ్యమంత్రి కార్యాలయానికి సంబంధించిన నిర్మాణంలో ఉన్న పిట్టగోడ ఇటుకలు ఒక్కొక్కటిగా కూలడంతో కార్మికులు పరుగులు తీశారు. ఈ ఘటనలో జార్ఖండ్‌కు చెందిన ముగ్గురు కార్మికులకు గాయాలయ్యాయి. సీఆర్డీఏ అధికారులు గుట్టుచప్పుడు కాకుండా కార్మికులను సమీపంలోని ఎన్నారై ఆసుపత్రికి తరలించారు. గాయపడిన రాంచరణ్ (36), ధర్మేంద్ర రామ్ (30), కిషోర్ చౌదరి (49) ఎన్నారై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రమాద సమయంలో కార్మికులు హెల్మెట్లు ధరించకపోతే ప్రాణాపాయం జరిగి ఉండేదని ఫస్ట్‌బ్లాక్‌లో పనిచేస్తున్న కార్మికులు తెలిపారు. కాగా గాయపడిన వారి ఆరోగ్య పరిస్థితి మెరుగ్గానే ఉందని ఎన్నారై వైద్యులు ప్రకటించారు.

చిత్రాలు..పిట్టగోడ పనులు జరుగుతున్న సచివాలయ భవనం. పిట్టగోడ కూలటంతో కిందపడిన ఇటుకలు. గాయపడిన జార్ఖండ్ కార్మికులు