ఆంధ్రప్రదేశ్‌

రష్యాలో జరిగే ప్రపంచస్థాయి నైపుణ్య పోటీలకు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, అక్టోబర్ 8: రష్యాలోని కజాని నగరంలో వచ్చే ఏడాది జరగనున్న ప్రపంచస్థాయి నైపుణ్య పోటీలకు ఆంధ్రప్రదేశ్ నుంచి ముగ్గురు ఎంపికయ్యారు. ఢిల్లీలోని ఎరోసిటీలో ఈ నెల 2 నుంచి 6వ తేదీ వరకు ఇండియా స్కిల్స్ 2018 పేరుతో జాతీయ స్థాయి నైపుణ్య పోటీలు జరిగాయి. 46 ట్రేడ్స్, 10 ప్రాంతీయ నైపుణ్యాలు, 4 డెమో స్కిల్స్ విభాగాల్లో జరిగిన పోటీల్లో 27 రాష్ట్రాల నుంచి 400 మందికి పైగా పాల్గొన్నారు. మన రాష్ట్రం నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ (ఏపీఎస్‌ఎస్‌డీసీ) ఆధ్వర్యంలో 10 విభాగాల్లో 15 మంది పాల్గొని, మూడు విభాగాల్లో పతకాలు సాధించారు.
రిఫ్రిజిరేషన్, ఎయిర్ కండిషనింగ్ విభాగంలో విశాఖ స్కిల్ డెవలప్‌మెంట్ ఇనిస్టిట్యూట్‌లో శిక్షణ పొందిన వేణుగోపాలరావు మొదటిస్థానంలో నిలిచి గోల్డ్ మెడల్ సాధించారు. నిర్వాహకులు అతనికి లక్ష రూపాయల నగదు బహుమతిని చెక్ రూపంలో అందజేశారు.
మొబైల్ రోబోటిక్స్ విభాగంలో కెఎల్ యూనివర్శిటీలో ఫస్ట్ ఇయర్ చదువుతున్న సాయి మణికంఠ, లోకేష్ చవన్‌లకు సిల్వర్ మెడల్, ఐటీ నెట్ వర్క్ అండ్ అడ్మినిస్ట్రేషన్ విభాగంలో కెఎల్ యూనివర్శిటీకి చెందిన రేపల్లె సాయి అఖిల్ కాంస్య పథకం సాధించారు. ఇక ఐటీ సాఫ్ట్‌వేర్ సొల్యూషన్స్ ఫర్ బిజినెస్ విభాగంలో జెఎన్టీయుఏ పులివెందులకు చెందిన బి ప్రణీత్‌కుమార్ రెడ్డి అర్హత సాధించి మెడల్ దక్కించుకున్నాడు. రిఫ్రిజిరేషన్, ఎయిర్ కండిషనింగ్ విభాగంలో గోల్డ్ మెడల్ సాధించిన వేణుగోపాలరావు, మొబైల్ రోబోటిక్స్ విభాగం నుంచి సిల్వర్ మెడల్ సాధించిన సాయి మణికంఠ, లోకేష్ చవన్‌లు 2019లో రష్యాలోని కజానీ నగరంలో జరిగే అంతర్జాతీయ స్థాయి నైపుణ్య పోటీల్లో పాల్గొంటారని ఏపీఎస్‌ఎస్‌డీసీ ఎండీఅండ్‌సీఈవో కె సాంబశివరావు తెలిపారు. విజేతలకు ప్రపంచస్థాయి నైపుణ్య పోటీలకు తగిన విధంగా అత్యుత్తమ శిక్షణ అందించబడుతుందని ఆయన తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ (ఏపీఎస్‌ఎస్‌డీసీ) ఈ నైపుణ్య పోటీలను సీఐఐ సహకారంతో అనంతపురం, తిరుపతి, విశాఖ, విజయవాడలో క్లస్టర్ స్థాయి పోటీలను నిర్వహించాయి.
మెకానికల్ ఇంజనీరింగ్ క్యాడ్, మెకట్రానిక్స్, ప్రొటోటైప్ మోడలింగ్, త్రీడీ యానిమేషన్, డిజిటల్ గేమ్ ఆర్ట్స్, సీఎన్సీ టర్నింగ్, కుకింగ్, ఎలక్ట్రానిక్స్, గ్రాఫిక్ డిజైన్ టెక్నాలజీ, ఐటీ సాఫ్ట్‌వేర్ టెక్నాలజీ, రిఫ్రిజిరేషన్ అండ్ ఎయిర్ కండీషనింగ్, వెబ్ డిజైనింగ్ సహా 26 విభాగాల్లో క్లస్టర్ స్థాయి పోటీల్లో విజేతలుగా నిలిచిన వారందరితో గత నెల 10,11 తేదీల్లో అమరావతిలోని సికె కనె్వక్షన్‌లో రెండు రోజులపాటు రాష్టస్థ్రాయి పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో విజేతలుగా నిలిచిన వారిని బెంగుళూరులో నిర్వహించిన రీజనల్ స్థాయి పోటీలకు పంపారు. రీజనల్ స్థాయి పోటీల్లో 10 విభాగాల్లో సత్తా చాటిన 15 మందిని జాతీయస్థాయి నైపుణ్య పోటీలకు ఎంపిక చేశారు.