ఆంధ్రప్రదేశ్‌

ట్రిపుల్ ఐటీల్లో రెండో విడత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వేంపల్లె, అక్టోబర్ 8: రాజీవ్‌గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం పరిధిలోని నాలుగు ట్రిపుల్ ఐటీల్లో రెండోవిడత ప్రవేశాల కోసం ఎదురుచూస్తున్న విద్యార్థుల భవితవ్యం రాష్ట్ర హైకోర్టు ధర్మాసనం ఎదుట ఉంది. హైకోర్టులో మంగళవారం దీనిపై విచారణ వాయిదా ఉండటంతో విద్యార్థులు వారి తల్లిదండ్రుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ప్రవేశాల ప్రక్రియ అంశం వాయిదాల మీద వాయిదా పడుతువస్తోందే తప్ప ఎటూ తేలకుండా పోయిందని విద్యార్థులు మదనపడుతున్నారు. ఇప్పటి వరకు రాష్ట్రంలోని ఇడుపులపాయ, ఒంగోలు, నూజివీడు, శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీల్లో ఆరేళ్ల సమీకృత ఇంజినీరింగ్ కోర్సులో చేరేందుకు పదో తరగతిలో అత్యుత్తమ జీపీఏ సాధించిన వారిని ఎంపిక చేసి తొలి విడతగా జూలైలో 4 వేల సీట్లు భర్తీ చేశారు. రెండోవిడతగా మిగులు సీట్లు, ప్రత్యేక కేటగిరీ కింద 750 సీట్లకు అర్హులైన విద్యార్థుల పేర్లు ప్రకటించి భర్తీ చేయాల్సి ఉంది. ప్రత్యేక కేటగిరీ కింద దివ్యాంగులు, సైనికోద్యోగుల పిల్లలు, ఎన్‌సీసీ, క్రీడా కోటా కింద 257 సీట్లు భర్తీ చేయాల్సి ఉంది. ప్రభుత్వ పాఠశాలల్లో పదో తరగతి పాసయిన వారికి వెనుకబాటు సూచిక కింద 0.4 శాతం అదనపు జీపీఏ కలిపే అంశంపై కడప జిల్లా రాయచోటికి చెందిన ఓ విద్యార్థిని హైకోర్టును ఆశ్రయించడంతో రెండోవిడత ప్రవేశాలకు బ్రేకులు పడ్డాయి.
అప్పటి నుంచి ఈ కేసు వాయిదాల పరంపర కొనసాగుతూనే ఉంది. సగం విద్యాసంవత్సరం పూర్తి కావస్తున్నా ఈ కేసు అంశం న్యాయస్థానంలో కొనసాగుతూనే ఉండటంతో ట్రిపుల్ ఐటీ సీట్ల ఆశావహుల్లో ఆందోళన నెలకొంది. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో కార్పొరేట్ తరహా వసతులు ఉండవు కాబట్టి పాఠశాలల్లో పదో తరగతి చదువుతున్న విద్యార్థులకు వెనుకబాటు కల్పించేందుకు 0.4 శాతం అదనపు జీపీఏ కలిపి ట్రిపుల్ ఐటీల్లో ఎక్కువ సీట్లు గ్రామీణ ప్రాంత విద్యార్థులకు కేటాయించాలన్న ఉద్దేశ్యంతో 2008లో అప్పటి ప్రభుత్వం ఆర్జీయూకేటీ 2008 చట్టాన్ని రూపొందించింది. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ట్రిపుల్ ఐటీ సీట్లలో వెనుకబాటు సూచీ అంశం అవకాశం లేకపోతే యూనివర్శిటీ స్థాపించిన ఉద్దేశానికి గండిపడుతుందని అధికారులు చెబుతున్నారు. దీనిని ప్రభుత్వం, యూనివర్శిటీ అధికారులు ప్రతిష్టాత్మకంగా తీసుకుని హైకోర్టులో కేసు వాదించేందుకు అడ్వకేట్ జనరల్ సహాయం కూడా తీసుకున్నారు. ఈ పరంపరలో మంగళవారం అయినా కేసు అంశం తేలుతుందో లేదోనని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.

చిత్రం..కడప జిల్లా ఇడుపులపాయలోని ట్రిపుల్ ఐటీ ముఖద్వారం