ఆంధ్రప్రదేశ్‌

సేవల్లో నిర్లక్ష్యం చేస్తే సహించం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విధుల్లో అలసత్వం ప్రదర్శిస్తే వేటు తప్పదు
108 సర్వీస్ ప్రొవైడర్లపై ముఖ్యమంత్రి ఆగ్రహం
త్వరలో 190 కొత్త వాహనాలు
అంబులెన్స్ లొకేషన్ సమాచారానికి ప్రత్యేక యాప్
====================================

అమరావతి, అక్టోబర్ 8: రాష్ట్రంలో 108 అంబులెన్స్ సేవల్లో నిర్లక్ష్యం వహిస్తే ఉపేక్షించేదిలేదని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్పష్టం చేశారు. సేవల్లో అలసత్వం ప్రదర్శిస్తే వేటు తప్పదని స్పష్టం చేశారు. సేవలను సమర్థవంతంగా నిర్వహించాలని ఆదేశించారు. సోమవారం సచివాలయంలో 108 అంబులెన్స్ సర్వీస్‌లపై సమీక్ష నిర్వహించారు. ఫోన్‌కాల్స్‌కు స్పందించే సమయం రెండు నిమిషాలకు తగ్గాలని సూచించారు. అలసత్వం ప్రదర్శించే సిబ్బందిని వెంటనే తొలగించాలని ఆదేశించారు. 108 అంబులెన్స్ లొకేషన్ వివరాలు అందరికీ తెలిసేలా వైద్యశాఖ ప్రత్యేకంగా ఒక మొబైల్ అప్లికేషన్‌ను రూపొందించాలని నిర్దేశించారు. 108 అంబులెన్స్‌లపై ప్రజా సంతృప్తిస్థాయి గత నెలల 73 శాతం ఉండగా అక్టోబర్‌లో 75 శాతం ఉందని అధికారులు వివరించగా 90 శాతం లక్ష్యం కావాలన్నారు. ఇందుకు సర్వీస్ ప్రొవైడర్లు కూడా తగిన చర్యలు తీసుకోవాలన్నారు. అంబులెన్స్ సర్వీసులపై పర్యవేక్షణకు రాష్ట్ర డ్రగ్ కంట్రోలర్‌ను ఇన్‌చార్జిగా నియమించేందుకు ముఖ్యమంత్రి ఆమోదం తెలిపారు. రాష్ట్రంలో ప్రస్తుతం నిర్వహణలో ఉన్న 468 వాహనాలు 2006లో కొనుగోలు చేసినవని, వీటిలో దెబ్బతిన్న వాహనాల స్థానంలో 278 కొత్త వాహనాలను ఈ మూడేళ్లలో ప్రవేశపెట్టామని అధికారులు తెలిపారు. మరో 50 కొత్త వాహనాలను త్వరలోనే సర్వీస్ ప్రొవైడర్లకు అందిస్తామన్నారు. మిగిలిన 140 వాహనాలను కూడా కొత్తవాటితో భర్తీచేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. సమావేశంలో వైద్య, ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి పూనం మాలకొండయ్య, ముఖ్యమంత్రి కార్యదర్శి గిరిజాశంకర్, 108 అంబులెన్స్ సర్వీస్ ప్రొవైడర్ ప్రతినిధులు పాల్గొన్నారు.