ఆంధ్రప్రదేశ్‌

ఎవరో రెచ్చగొడితే కోర్టుకెళతారా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, అక్టోబర్ 8: మిల్లర్లలో క్రమశిక్షణ ఉండాలి..పద్ధతి ప్రకారం పనిచేయకపోతే రాష్ట్రం ఇబ్బందుల్లో పడుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్పష్టంచేశారు. రాష్ట్రం ధాన్యం సేకరించినా ఇప్పుడు తీసుకోబోమని కేంద్రం లేఖరాసిందని, ఒక సీజన్ నుంచి మరొక సీజన్ వరకు సాగదీస్తే ఎలా అని కేంద్రం ప్రశ్నిస్తుంటే మిల్లర్లు జాప్యం చేస్తే ఎలా అని ప్రశ్నించారు. నిర్ణీత సమయంలో ప్రొక్యూర్‌మెంట్ పూర్తికావాల్సిందే అని స్పష్టం చేశారు. సోమవారం సచివాలయంలో లెవీ సేకరణకు మరో 30 రోజులు గడువు కావాలని మిల్లర్లు కోరిన నేపథ్యంలో మంత్రులు పితాని సత్యనారాయణ, ప్రత్తిపాటి పుల్లారావు ముఖ్యమంత్రితో ఈ విషయమై చర్చించారు. మిల్లర్ల సమస్యను సానుభూతితో అర్థం చేసుకుని రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకుంది.. కృష్ణాడెల్టాకు ఒకప్పుడు నీళ్లులేక ఇబ్బందులు ఉండేవి.. ఇప్పుడు పట్టిసీమతో కష్టాలు గట్టెక్కించాం.. గోదావరి డెల్టాకు రెండు పంటలకు నీరందిస్తున్నాం.. ఎవరో వచ్చి రెచ్చకొడితే రెచ్చిపోవటం.. కోర్టులకు వెళ్లి ఇబ్బందులు పెట్టాలనుకోవటం సరికాదని ముఖ్యమంత్రి అన్నారు. ప్రజాస్వామ్య యుతంగా పనిచేస్తున్నాం.. నీతివంతమైన పాలన అందిస్తున్నామని తెలిపారు. రూ 200 కోట్ల మేర ఎన్‌క్యాష్ చేసే పరిస్థితి ఆఖరి నిమిషంలో ప్రభుత్వం చొరవ తీసుకుని సరిదిద్దింది. నాకు రైతులు, మిల్లర్లు సమానమే.. ప్రభుత్వానికి మచ్చతెచ్చే పనులు చేయద్దు.. ప్రభుత్వం ఇచ్చిన వ్యవధిని వినియోగించుకోవాలని సీఎం ఆదేశించారు. ధాన్యం సేకరణకు మిల్లర్లకు మరో 30 రోజుల పాటు గడువు ఇచ్చేందుకు ముఖ్యమంత్రి అంగీకరించారు. సమస్యపై ఎఫ్‌సీఐతో మాట్లాడాలని అధికారులను ఆదేశించారు. అంతకు ముందు మిల్లర్లు ఎదుర్కొంటున్న సమస్యలపై మంత్రులు చర్చించారు. మిల్లర్లు ఎదుర్కొంటున్న సమస్యలపై పశ్చిమ గోదావరి జిల్లా ప్రజాప్రతినిధులంతా ఏకతాటిపై నిలిచి ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చిన విషయం ప్రస్తావనకు వచ్చింది. ఈ విషయంలో ప్రభుత్వం తక్షణం స్పందించకపోతే బ్యాంక్ గ్యారంటీలు రావని, రుణాలు మంజూరు కావని ఇబ్బందులతో పాటు పరిశ్రమ మనుగడకు ప్రమాదం వాటిల్లుతుందని మిల్లర్లు వాదించారు. స్టాక్‌లేని మిల్లులకు పొడిగింపు ఇవ్వాలని కోరారు. ప్రభుత్వాన్ని మోసం చేయాలనే ఆలోచన తమకు లేదని స్పష్టం చేశారు. మంత్రులు పితాని, ప్రత్తిపాటి మాట్లాడుతూ మిల్లర్ల ఇబ్బందులను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లామని, 30 రోజులు గడువు పొడిగించేందుకు సమ్మతించిందని చెప్పారు. తాత్కాలికంగా అయినా గిడ్డంగులను ఏర్పాటు చేస్తామని ఏపీ ప్రభుత్వ గిడ్డంగుల సంస్థ చైర్మన్ ఎల్‌వీఎస్‌ఆర్‌కే ప్రసాద్ తెలిపారు.