ఆంధ్రప్రదేశ్‌

తోళ్ల పరిశ్రమలో ముందడుగు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మూడేళ్లలో రూ. 1000 కోట్ల పెట్టుబడి
లిడ్‌క్యాప్, సీఎల్‌ఆర్‌ఐ,
సీఎస్‌ఐఆర్ మధ్య అవగాహన ఒప్పందం
కాలుష్య రహిత పరిశ్రమలు నెలకొల్పాలని ముఖ్యమంత్రి ప్రతిపాదన
=======================================
అమరావతి, అక్టోబర్ 8: రాష్ట్రంలో తోళ్ల పరిశ్రమ అభివృద్ధికి సంబంధించి వౌలిక వసతుల కల్పన, సాంకేతిక శిక్షణ, సాంకేతిక సహకారానికి సెంట్రల్ లెదర్ రీసెర్చి ఇనిస్టిట్యూట్ (సీఎల్‌ఆర్‌ఐ) ముందుకొచ్చింది. సోమవారం సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో లిడ్‌క్యాప్- సీఎస్‌ఐఆర్, సీఎల్‌ఆర్‌ఐ మధ్య ఒప్పందం కుదిరింది. ముందుగా తోళ్ల పరిశ్రమ అభివృద్ధికి రాష్ట్రంలో అవకాశాలపై ఆధ్యయనం చేయాలని సీఎల్‌ఆర్‌ఐ నిర్ణయించింది. వచ్చే మూడేళ్లలో తోళ్ల పరిశ్రమలో పెట్టుబడులను రూ. 1000 కోట్లకు పెంచటం, ఉద్యోగావకాశాలను 20వేలకు నిర్దేశించడం రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి స్పష్టంచేశారు. రాష్ట్రంలో మినీ లెదర్ పార్క్‌లు, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతిలో బిజినెస్ సెంటర్లు, 78 లెదర్ షోరూంలు ఏర్పాటయ్యేలా కృషిచేస్తామని సీఎల్‌ఆర్‌ఐ ప్రతినిధులు వెల్లడించారు. తోళ్ల పరిశ్రమ రంగంలో పెట్టుబడులను రాష్ట్రం ఆకర్షించేలా సీఎల్‌ఆర్‌ఐ ప్రచారం చేయనుంది. ఈ మేరకు ముఖ్యమంత్రితో లెదర్ సెక్టార్‌కు చెందిన పెట్టుబడిదారులు, అవంతి లెదర్ లిమిటెడ్, ఓవర్సీస్ లెదర్స్, చావా లెదర్ ఎక్స్‌పోర్టు ప్రతినిధులు చర్చలు జరిపారు. అవంతి లెదర్ లిమిటెడ్ రూ 150 కోట్ల పెట్టుబడి, 2500 మందికి ఉపాధి, ఓవర్సీస్ లెదర్స్ రూ 20 కోట్ల పెట్టుబడి, 300 మందికి ఉపాధి, చావా లెదర్ ఎక్స్‌పోర్ట్ సంస్థ రూ 15 కోట్ల పెట్టుబడితో 200 మందికి ఉపాధి కల్పించేందుకు సుముఖత వ్యక్తం చేశాయి. పెట్టుబడిదారుల కోసం వివరణాత్మక ప్రాజెక్ట్ నివేదికలను సీఎల్‌ఆర్‌ఐ సిద్ధం చేస్తోంది. అత్యంత నాణ్యమైన ఉత్పత్తులు చేపట్టాలని, కాలుష్య రహిత పరిశ్రమలు నెలకొల్పాలని ముఖ్యమంత్రి సూచించారు. లిడ్‌క్యాప్ చైర్మన్ గూడూరి ఎరిక్సన్‌బాబు, ఎండీ సాధు సుందర్, సీఎల్‌ఆర్‌ఐ డైరెక్టర్ బి చంద్రశేఖరన్ తదితరులు భేటీలో పాల్గొన్నారు.