ఆంధ్రప్రదేశ్‌

నియామక నిబంధనల్లో మార్పులకు కమిటీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, అక్టోబర్ 8: రాష్ట్ర ప్రభుత్వం పూర్తిస్థాయిలో ఆధునిక సాంకేతిక పరిజానాన్ని ఉపయోగిస్తున్న నేపథ్యంలో నూతన నియామకాల నిబంధనల్లో మార్పులు అవసరమని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనిల్ చంద్ర పుణేఠ వ్యాఖ్యానించారు. వెలగపూడి సచివాలయంలో ఆయన తన కార్యాలయంలో ఈ-ప్రగతి, ఆర్టీజీ, కాగిత రహిత కార్యాలయాలపై సోమవారం సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ టెక్నాలజీ వినియోగం వల్ల వివిధ ప్రభుత్వ శాఖల పనితీరులో మార్పు వచ్చిందన్నారు. దీనికి అనుగుణంగా నియామక నిబంధనల్లో విద్యార్హతలు, తదితర అంశాల్లో మార్పులు అవసరమన్నారు. మార్పులను సూచించేందుకు వీలుగా ఒక కమిటీని నియమిచాలని తెలిపారు. ప్రభుత్వ సిబ్బందికి సాంకేతిక శిక్షణా కోర్సులు కూడా నిర్వహించాలన్నారు. దీనిని తప్పనసరి చేయాలని స్పష్టం చేశారు. ఈ-ప్రగతి అమలును మరింత వేగవంతం చేసేందుకు ఐటి కార్యదర్శి కన్వీనర్‌గా 15 శాఖల కార్యదర్శులతో మరో కమిటీని కూడా నియమిస్తున్నట్లు తెలిపారు. ప్రతి శాఖలో ఒక అధికారికి ఈ-ఆఫీస్ బాధ్యతలు అప్పగించాలని ఆదేశించారు. సేవల్లో నాణ్యత పెరిగితే ప్రజల సంతృప్తి పెరుగుతుందన్నారు. వివిధ శాఖలు సమన్వయంతో 100 శాతం ఈ-ఆఫీసు సాధించాలన్నారు. ఆరు శాఖలు సమన్వయంతో పని చేసి యువనేస్తం పథకాన్ని విజయవంతం చేయాలన్నారు. పీపుల్స్ ఫస్ట్ కార్యక్రమంలో ప్రజలను అడిగే ప్రశ్నల్లో మార్పులు చేయాలన్నారు. ప్రభుత్వ ఐటి సలహాదారు సత్యనారాయణ మాట్లాడుతూ ఈ-ప్రగతిని దృష్టిలో ఉంచుకుని హెచ్‌ఆర్ పాలసీని రూపొందించాలన్నారు. వారం లేదా 10 రోజులు శిక్షణా కోర్సులు తప్పనిసరి చేయాలన్నారు. వైద్య, ఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య మాట్లాడుతూ తమ శాఖ ద్వారా మరో 4 పథకాలు త్వరలో ప్రవేశపెట్టనున్నట్లు తెలిపారు. ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డి.సాంబశివరావు మాట్లాడుతూ ఉన్నత పాఠశాల స్థాయి నుంచే కంప్యూటర్ కోర్సులను ప్రవేశపెట్టాలని సూచించారు. ఆర్టీజీ సీఈవో బాబు.ఎ మాట్లాడుతూ 1100 ద్వారా ప్రజల అసంతృప్తికి కారణాలు తెలుసుకుంటున్నామన్నారు.