ఆంధ్రప్రదేశ్‌

వివిధ శాఖల ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.ఖఅధికారులతో సీఎస్ సమీక్ష

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మళ్లీ అధికారం మాదే
* జగన్ కాశీ యాత్ర చేసుకోవాలి
* మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు
=======================================
అమరావతి, అక్టోబర్ 8: వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయం సాధించి మళ్లీ అధికారంలోకి రావడం ఖాయమని, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి పాదయాత్రను కాశీ వరకు కొనసాగించుకోవాల్సి వస్తుందని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు విమర్శించారు. సోమవారం సచివాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ అభివృద్ధిని బీజేపీ, వైసీపీ అడ్డుకుంటున్నాయని ధ్వజమెత్తారు. పోలవరం నిర్వాసితులు దేవుళ్లని, వారిని ప్రభుత్వం అన్నివిధాలా ఆదుకుంటుందని భరోసా ఇచ్చారు. ఆరు నెలల్లో కొత్త ఇళ్లలో వారితో గృహప్రవేశాలు చేయిస్తామని వెల్లడించారు. ఎవరెన్ని ఆటంకాలు కల్పించినా 2019 నాటికి గ్రావిటీతో నీరందిస్తామని పునరుద్ఘాటించారు. ఇప్పటివరకు 59.01 శాతం పోలవరం పనులు పూర్తయ్యాయని, వచ్చే నెలలో గేట్లు ఏర్పాటవుతాయని చెప్పారు. పట్టిసీమ ద్వారా ఈ ఏడాది ఇప్పటివరకు 63 టీఎంసీల నీటిని అందించామన్నారు. బీజేపీ డైరెక్షన్‌లో జగన్ ఎన్ని కుట్రలు పన్నినా, కోర్టులో కేసులు వేసినా పోలవరం నిర్మాణం ఆగదని తేల్చిచెప్పారు. ప్రాజెక్టును కళ్లుండి కూడా జగన్ చూడలేకపోవటం దౌర్భాగ్యమన్నారు. వర్షాభావ పరిస్థితుల్లో సైతం పులివెందులకు నీరందించిన ఘనత తమ ప్రభుత్వానిదేనని, ఆ ప్రాంత ప్రజలు ముఖ్యమంత్రి చంద్రబాబుకు నీరాజనాలు పలుకుతున్నారని తెలిపారు. శరవేగంతో అమరావతి నిర్మాణాలు జరుగుతున్నాయని, రాష్ట్రానికి ఐటీ కంపెనీలు తరలివస్తుంటే అక్కసుతో జగన్ విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో 21 ఎంపీ స్థానాలు వస్తాయని సొంత సంస్థలతో సర్వే చేయించుకుని జగన్ పగటికలలు కంటున్నారని వ్యాఖ్యానించారు. గత సార్వత్రిక ఎన్నికలకు ముందు కూడా ఇదేవిధంగా కలగన్నారని గుర్తుచేశారు. ఈ నెల 10న భైరవానితిప్ప ప్రాజెక్టుకు ముఖ్యమంత్రి భూమిపూజ చేస్తారని మంత్రి ఉమా వివరించారు.