ఆంధ్రప్రదేశ్‌

త్వరలో శాశ్వత భూధార్ సంఖ్య కేటాయింపులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, అక్టోబర్ 8: కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలంలో త్వరలో శాశ్వత భూధార్ సంఖ్యను కేటాయించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. భూసేవ కింద భూధార్ ప్రాజెక్టును పైలట్ ప్రాజెక్టుగా అమలుకు కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం, ఉయ్యూరు నగర పంచాయతీలను ఎంపిక చేసింది. జగ్గయ్యపేట మండలంలో పైలట్ ప్రాజెక్టు విజయవంతం కావడంతో శాశ్వత సంఖ్యను కేటాయించేందుకు రంగం సిద్ధం చేస్తోంది. రాష్ట్రంలో భూ కమతాల వివరాలను డిజిటలైజ్ చేసి, వాటికి ఆధార్ తరహాలో భూధార్ పేరుతో 11 అంకెల విశిష్ఠ సంఖ్య కేటాయించేందుకు రాష్ట్ర రెవెన్యూ శాఖ నిర్ణయించడం తెలిసిందే. పైలట్ ప్రాజెక్టుగా జగ్గయ్యపేట మండలాన్ని, ఉయ్యూరు నగర పంచాయతీని ఎంపిక చేసింది. ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ఈ ఏడాది ఏప్రిల్ 11న ప్రారంభించింది. అక్టోబర్ నాటికి కృష్ణా జిల్లా, వచ్చే ఏడాది ఫిబ్రవరి నాటికి రాష్ట్రం అంతటా భూధార్ జారీ చేసేందుకు వీలుగా భూసేవ పోర్టల్‌ను ప్రారంభించింది. రాష్ట్రంలో 2.84 కోట్ల వ్యవసాయ భూ కమతాలు, 50 లక్షల పట్టణ ప్రాంతాల్లోని ఆస్తులు, గ్రామీణ ప్రాంతాల్లోని 85 లక్షల ఆస్తుల వివరాలను డిజిటలైజ్ చేసి భూధార్ సంఖ్య కేటాయించాల్సి ఉంది. ఇందుకు అవసరమైన యంత్ర సామగ్రిని సమకూరుస్తున్నారు. కచ్చితంగా భూ కమతాల హద్దులను నమోదు చేసేందుకు వీలుగా డీజీపీఎస్ (డిఫరెన్షియల్ గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్), కంటిన్యువస్‌లీ ఆపరేటింగ్ రిఫరెన్సు సిస్టమ్ (సివోఆర్‌ఎస్), రోవర్స్ పరికరాలను ఆ మండలానికి రాష్ట్ర ప్రభుత్వం సరఫరా చేసింది. ఒక్కో డీజీపీఎస్ పరికరాన్ని 75 లక్షల రూపాయల వ్యయంతో కొనుగోలు చేసి, నాలుగు పరికరాలు జిల్లాకు కేటాయించింది. ఆయా భూ కమతాల జియో కో-ఆర్డినేట్లను డీజీపీఎస్ పరికరం ద్వారా సేకరించి, వాటిని డిజిటల్ ఎఫ్‌ఎంబిలో నమోదు చేస్తారు. తరువాత 11 అంకెల విశిష్ట భూధార్‌ను కేటాయిస్తారు. వచ్చే వారం నుంచి శాశ్వత భూధార్ జారీకి ఏర్పాట్లు చేస్తున్నట్లు మండల రెవెన్యూ అధికారులు చెబుతున్నారు.