ఆంధ్రప్రదేశ్‌

15వ ఆర్థిక సంఘం సభ్యులు నేడు రాష్ట్రానికి రాక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, అక్టోబర్ 8: రాష్ట్రంలో 15వ ఆర్థిక సంఘం సభ్యులు మంగళవారం నుంచి పర్యటించనున్నారు. ఈ నెల 9న ఉదయం ఢిల్లీ నుంచి విమానంలో బయల్దేరి మధ్యాహ్నం 2.15కి తిరుపతి చేరుకుంటారు. భోజన విరామానంతరం మధ్యాహ్నం 3.45 గంటలకు తిరుచానూర్ పద్మావతీ ఆలయాన్ని సందర్శిస్తారు. 5గంటలకు తిరుమలకు చేరుకుని రాత్రికి బస చేస్తారు. బుధవారం ఉదయం స్వామివారిని దర్శించుకుని ఉదయం 11.30 గంటలకు శ్రీకాళహస్తి చేరుకుంటారు. ప్రత్యేక పూజల అనంతరం మధ్యాహ్నం 2.30 గంటల నుంచి ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొంటారు. సాయంత్రం 5గంటలకు తిరుపతి నుంచి బయల్దేరి 7గంటలకు విజయవాడ చేరుకుంటారు. రాత్రికి గేట్‌వే హోటల్‌లో బస చేస్తారు. 11న ఉదయం కనకదుర్గమ్మ ఆలయాన్ని సందర్శించిన అనంతరం ఉదయం 9.30 గంటలకు వెలగపూడి బయల్దేరి వెళతారు. 10.30 గంటల వరకు ముఖ్యమంత్రితో ముఖాముఖి అయిన అనంతరం మధ్యాహ్నం 1.30 గంటల వరకు ముఖ్యమంత్రి, కేబినెట్ మంత్రులతో సమావేశమవుతారు. మధ్యాహ్నం 2.45 నుంచి 3.45 గంటల వరకు రాజకీయ పార్టీలతో భేటీ ఉంటుంది. సాయంత్రం 4గంటలకు మీడియాతో మాట్లాడతారు. సాయంత్రం 5.30 గంటలకు గేట్‌వే హోటల్‌కు చేరుకుంటారు. 12న ఉదయం 10గంటలకు సచివాలయానికి చేరుకుని 11 గంటలకు సీఆర్డీఏ పవర్‌పాయింట్ ప్రజంటేషన్ తిలకిస్తారు. అనంతరం సీఆర్డీఏ పరిధిలో ఏరియల్ సర్వే నిర్వహిస్తారు. మధ్యాహ్నం 2.45 నుంచి 3.45 గంటల వరకు పారిశ్రామిక, వ్యాపార ప్రతినిధులతో సమావేశమవుతారు. సాయంత్రం పట్టణ, గ్రామీణ స్థానిక సంస్థల ప్రతినిధులతో సమావేశం నిర్వహించిన అనంతరం రాత్రి 8.40 గంటలకు వారు తిరిగి ఢిల్లీ బయల్దేరి వెళతారు.