ఆంధ్రప్రదేశ్‌

అన్నిరకాల క్రీడలకు వేదికలుగా విశాఖ, తిరుపతి, అమరావతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, అక్టోబర్ 8: అన్ని రకాల క్రీడలకు వేదికగా విశాఖ, అమరావతి, తిరుపతి పట్టణాల్లో స్పోర్ట్స్ సిటీలను ఏర్పాటు చేస్తున్నట్లు రాష్ట్ర క్రీడల శాఖా మంత్రి కొల్లు రవీంద్ర వెల్లడించారు. సోమవారం ఉదయం తిరుపతి ఎస్వీ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌ను మంత్రి సందర్శించారు. ఈసందర్భంగా క్రీడాకారులతో కలిసి బ్యాడ్మింటన్ ఆడారు. జిమ్‌ను, స్విమ్మింగ్‌పూల్‌ను సందర్శించారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ తిరుపతి స్మార్ట్‌సిటీ భాగస్వామ్యంతో ఎస్వీ స్పోర్ట్స్ కాంప్లెక్స్ మరింత అభివృద్ధి చెందుతుందని వివరించారు. తిరుపతికి సమీపంలోని సూరప్పకశం వద్ద అంతర్జాతీయ ప్రమాణాలతో 150 ఎకరాలలో స్పోర్ట్స్ సిటీ నిర్మాణం రూపకల్పన చేయనున్నట్లు చెప్పారు. శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో రూ.40.62 కోట్లు వెచ్చించి క్రీడా సముదాయ నిర్మాణ చేపట్టనున్నామని తెలిపారు. క్రీడాకారులను ప్రోత్సహించే విధంగా ప్రాజెక్టులు పాంచజన్యం, గాండీవాలు ఏర్పాటు చేసి ప్రతిభావంతుల్ని దేశ, అంతర్జాతీయ స్థాయిలో ఏపీ క్రీడాకారులకు గుర్తింపు లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం క్రీడలకు ప్రోత్సాహం ఇస్తోందన్నారు. సీఎం కప్స్ నిర్వాహణకు మండల, జిల్లా స్థాయిలో నిధుల కొరతలేదన్నారు.