ఆంధ్రప్రదేశ్‌

గోదాముల నిర్మాణానికి చురుగ్గా ఏర్పాట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, అక్టోబర్ 8: రాష్ట్రంలో వ్యవసాయ ఉత్పత్తుల నిల్వకు గోదాముల కొరతను అధిగమించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ప్రస్తుతం ఉన్న గోదాముల నిల్వ సామర్థ్యాన్ని రెట్టింపు చేసేందుకు లక్ష్యంగా నిర్ణయించింది. వ్యవసాయ ఉత్పత్తులు నిల్వ చేసేందుకు సరిపడా గోదాములు లేకపోవడంతో రైతులు తమ వ్యవసాయ ఉత్పత్తులను తక్కువ ధరకే విక్రయించాల్సి వస్తోంది. ప్రైవేట్ గోదాముల్లో నిల్ల ఖర్చుతో కూడుకున్నది కావడంతో పంట కోతకు వచ్చిన వెంటనే అమ్ముకోవాల్సిన పరిస్థితి నెలకొంది. దీనిని దృష్టిలో ఉంచుకుని ప్రస్తుతం గోదాముల నిల్వ సామర్ధ్యాన్ని పెంచనుంది. ప్రస్తుతం ఉన్న 6.52 లక్షల టన్నుల సామర్థ్యాన్ని 11.67 లక్షల టన్నులకు పెంచేందుకు చర్యలు తీసుకుంటోంది. దాదాపు 342 కోట్ల రూపాయలతో కొత్తగా గోదాములు నిర్మించేందుకు, ఇప్పటికే ఉన్న వాటిని ఆధునీకరించేందుకు చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగాంగా దాదాపు 80 వేల టన్నుల సామర్థ్యం కలిగిన నాలుగు గోదాముల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గోదాముల నిర్మాణానికి వీలుగా వ్యవసాయ మార్కెట్ కమిటీల ఆధీనంలో ఉన్న స్థలాలను రాష్ట్ర గిడ్డంగుల సంస్థలకు బదిలీ చేసేందుకు వీలుగా ఉత్తర్వులు జారీ చేసింది. శ్రీకాకుళం జిల్లా సరుబుజ్జిలి, కృష్ణా జిల్లా వెలగలేరు, చిత్తూరు మార్కెట్ కమిటీలకు చెందిన నాలుగేసి ఎకరాలను, కృష్ణా జిల్లా గన్నవరం మార్కెట్ కమిటీకి చెందిన 12 ఎకరాలను గిడ్డంగుల సంస్థకు బదలాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో దాదాపు మూడు లక్షల టన్నుల నిల్వకు వీలు కలుగనుంది.