ఆంధ్రప్రదేశ్‌

ఐదో రోజుకి చేరిన మున్సిపల్ సమ్మె

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, అక్టోబర్ 8: మున్సిపల్ కార్మికుల పొట్టగొట్టే 279 జీఓ రద్దు, కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ కార్మికుల పర్మినెంట్, సమాన పనికి సమాన వేతనం తదితర డిమాండ్లపై మున్సిపల్ కార్మికులు చేపట్టిన నిరవధిక సమ్మె సోమవారం ఐదో రోజు కూడా కొనసాగింది. ప్రభుత్వ నిర్బంధకాండ, అక్రమ అరెస్టులు, అధికారుల బెదిరింపులు, అధికార పార్టీ నాయకుల దాడులతో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. ఇలాఉంటే ఆదివారం రాష్ట్ర మున్సిపల్ పరిపాలన సంచాలకులు కె కన్నబాబు సమ్మె చేస్తున్న కార్మికులను రెచ్చగొట్టే విధంగా ప్రకటన చేయడం శోచనీయమని జేఏసీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్మికులు అర్ధనగ్న ప్రదర్శనలు, మానవహారాలు, భిక్షాటనలు, రాస్తారోకోలు తదితర రూపాల్లో తమ నిరసనను వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 110కిగాను 105 మున్సిపాల్టీల్లో సమ్మె కొనసాగుతోంది.