ఆంధ్రప్రదేశ్‌

మీకు నేనున్నా..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, అక్టోబర్ 8: ప్రభుత్వ సాయం కోసం పెద్దఎత్తున తరలివచ్చిన ఆపన్నులకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అభయహస్తం అందించారు.
సోమవారం ఉండవల్లి ప్రజావేదికలో పలువురికి ఆర్థికసాయం ప్రకటించారు. ఫించన్లు, ఉపకారవేతనాలు, ఇళ్లస్థలాలు, గృహ నిర్మాణం, వైద్యసేవల కోసం అర్థించగా, వారికి తక్షణం ఆర్థికసాయం అందించి సమస్యలు పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.
కేరళ వరద బాధితులకు ‘సెర్ప్’ సాయం
కేరళ ముఖ్యమంత్రి సహాయనిధికి రాష్ట్రంలోని సెర్ప్ ఉద్యోగులు తమ ఒక రోజు వేతనాన్ని సాయంగా ప్రకటించారు. ఇందుకు సంబంధించిన రూ 9లక్షల 25వేల 400 చెక్కును ముఖ్యమంత్రి చంద్రబాబుకు సోమవారం గ్రీవెన్స్‌సెల్‌లో అందజేశారు. తమ పదవీ విరమణ వయసును 58 నుంచి 60 ఏళ్లకు పొడిగించినందుకు సెర్ప్ ఉద్యోగులు ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు.
ప్రభుత్వ ఉద్యోగులకు పీఆర్‌సీ అమలు, పదవీ విరమణ వయసు పెంపు, అధ్యాపకులకు అసిస్టెంట్ ప్రొఫెసర్ హోదా ఇవ్వడం, ఫిట్‌మెంట్ సమస్యలను పరిష్కరించటం వంటి ప్రయోజనాలు చేకూర్చిన ముఖ్యమంత్రిని రాష్ట్రంలోని వివిధ అధ్యాపకుల సంఘాలు సత్కరించి ధన్యవాదాలు తెలిపారు. యూజీసీ -2016, 7వ పీఆర్‌సీని తక్షణమే అమలు చేయాలని కోరారు. ఎమ్మెల్సీ ఏఎస్ రామకృష్ణ ఆధ్వర్యంలో జీసీటీఏ, జీసీజీటీఏ, ఏసీటీఏ, ఏపీ రిటైర్డు కాలేజీ టీచర్స్ అసోసియేషన్, యూనివర్శిటీ అధ్యాపకుల సంఘాల ప్రతినిధులు ముఖ్యమంత్రిని కలిశారు.
జూనియర్ అథ్లెటిక్ ఛాంపియన్‌కు అభినందన
ఇంటర్‌స్టేట్ సౌత్ జోన్ నేషనల్ గేమ్స్‌లో సత్తా చాటిన వై కార్తీక్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబు అభినందించారు.
రాష్ట్రం తరుపున పోటీపడి హైజంప్, లాంగ్‌జంప్‌లో స్వర్ణపతకాలతో పాటు, బెస్ట్ అథ్లెట్‌గా, జూనియర్ అథ్లెటిక్ చాంపియన్‌గా రాణించటం పట్ల ప్రశంసించారు. క్రీడల అభివృద్ధికి ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని, ప్రతిభ చూపిన క్రీడాకారులను తగిన విధంగా ప్రోత్సహిస్తున్నట్టు ఆయన చెప్పారు.
ప్రకాశం జిల్లా దర్శి మండలం కొత్తపల్లికి చెందిన కార్తీక్ భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని, ప్రభుత్వం తరుపున, శాప్ నుంచి ప్రోత్సాహం ఉంటుందని ముఖ్యమంత్రి చెప్పారు. కాగా రాజధాని అమరావతి అభివృద్ధికి ఐటీ ప్రొఫెషనల్ లక్ష్మీ చెన్ను రూ 50వేల ఆర్థికసాయాన్ని ముఖ్యమంత్రికి అందజేశారు.

చిత్రం..ముఖ్యమంత్రికి సమస్యలు విన్నవించుకుంటున్న ప్రజలు