ఆంధ్రప్రదేశ్‌

అమరావతిలో 7 కేటగిరీలుగా 12 వేల క్వార్టర్ల నిర్మాణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూలై 11: ఆంధ్రప్రదేశ్ సచివాలయ సిబ్బంది నూతన రాజధాని అమరావతికి తరలివస్తున్న నేపథ్యంలో వారికి క్వార్టర్లు నిర్మించేందుకు సిఆర్‌డిఏ అవసరమైన చర్యలు చేపడుతోంది. ప్రభుత్వ ఉన్నతాధికారులు, గెజిటెడ్ అధికారులు, ఇతర సిబ్బంది ఉన్నపళంగా ఇక్కడికి రావాలంటే వారికి గృహ వసతి కల్పించాల్సిన అవసరం ఉంది. రాజధానిని కొత్తగా నిర్మిస్తున్నందున ఇక్కడ క్వార్టర్లతో పాటు ఇతర సౌకర్యాలు ఏమీలేవని హైదరాబాద్ నుంచి వెంటనే రావడానికి కొందరు ఉద్యోగులు ఆసక్తి చూపడంలేదు. ఈ పరిస్థితుల్లో ఉద్యోగుల్లోని సందేహాలను పారదోలేలా క్వార్టర్లు నిర్మించాలని ప్రభుత్వం భావిస్తోంది. 12వేల క్వార్టర్లు శరవేగంగా నిర్మించడానికి గృహ నిర్మాణ శాఖ ప్రణాళికలు సిద్ధం చేసింది. ఓపక్క రాజధాని నిర్మాణ ఒప్పందాలు శరవేగంగా జరుగుతున్నాయి. మరోపక్క ప్రభుత్వ గృహాల నిర్మాణానికి సిఆర్‌డిఏ ప్లాన్లను సిద్ధం చేసింది. ఈ గృహ నిర్మాణ ప్లాన్లను రూపొందించడంలో ఏపి హౌసింగ్ బోర్డుకు చెందిన ముగ్గురు ఇంజనీర్లు పూర్తిగా నిమగ్నమయ్యారు. వెలగపూడిలో తాత్కాలిక రాజధాని నిర్మాణం పూర్తి అయితే ఇక ప్రధాన రాజధాని నిర్మాణం పైనే ప్రభుత్వం, సిఆర్‌డిఏ దృష్టి కేంద్రీకృమవుతుంది. న్యాయమూర్తులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, దాదాపు 12వేల మంది ప్రభుత్వ ఉద్యోగులకు క్వార్టర్లు నిర్మించవలసి ఉంది. అందరికీ 7 కేటగిరీలుగా గృహాలు నిర్మించడానికి సిఆర్‌డిఏ ప్రతిపాదనలు సిద్ధం చేసింది. క్వార్టర్ల విషయంలో భయాందోళనలు వ్యక్తం చేస్తున్న ఉద్యోగులకు ఇది ఊరట కలిగించే అంశం. న్యాయమూర్తులు, సీనియర్ ఐఎఎస్ అధికారులకు మాత్రమే డూప్లెక్స్ హౌస్‌లు నిర్మిస్తారు. మిగిలిన వారందరికీ జీ + 9 ఫ్లోర్లు ఉంటాయి. సిఆర్‌డిఏ ప్రతిపాదించిన ప్లాన్ల ప్రకారం న్యాయమూర్తులు, ఉన్నత న్యాయాధికారులు, ఆల్ ఇండియా సర్వీసెస్‌కు చెందిన సీనియర్ అధికారుల కోసం 3500 అడుగుల ప్లిన్త్ ఏరియాతో డూప్లెక్స్ హౌస్‌లు నిర్మిస్తారు. ఇక మిగిలిన వారందరికీ జీ+9 అపార్ట్‌మెంట్లలో ఫ్లాట్లు కేటాయిస్తారు. శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు నివాసం ఉండే అపార్ట్‌మెంట్లలో 3500 అడుగుల ప్లిన్త్ ఏరియాతో ఫ్లాట్లు ఉంటాయి. ఆల్ ఇండియా సర్వీసెస్ జూనియర్ అధికారులు, అన్ని శాఖల హెడ్స్ కోసం 3వేల అడుగుల ప్లిన్త్ ఏరియాతో అపార్ట్‌మెంట్ నిర్మిస్తారు. గజిటెడ్ అధికారులు ఉండే క్వార్టర్ల ప్లిన్త్ ఏరియా 1800 అడుగులు ఉంటుంది. నాన్ గజిటెడ్ అధికారుల కోసం 1200 అడుగుల ప్లిన్త్ ఏరియాతో, మిగిలిన నాలుగో తరగతి ఉద్యోగులందరి కోసం 800 అడుగుల ప్లిన్త్ ఏరియా ప్లాట్లలో అపార్ట్‌మెంట్లు నిర్మించాలని సిఆర్‌డిఏ ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ఈ ప్లాన్లకు పరిపాలనాపరమైన ఆమోదం లభించవలసి ఉందని సిఆర్‌డిఏ ఇఇ కె మల్లికార్జునరావు తెలిపారు.