ఆంధ్రప్రదేశ్‌

ఇదేం మెనూ..ఇలాగేనా పెట్టేది?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం(టౌన్), జూలై 11: మంత్రి మృణాళిని ఆకస్మిక తనిఖీతో ఉపాధ్యాయులు, మధ్యాహ్న భోజన పథకం నిర్వాహకులు హతలెత్తిపోయారు. సోమవారం ఉదయం పట్టణంలోని కస్పా మున్సిపల్ హైస్కూల్‌కు మంత్రి అకస్మాత్తుగా వచ్చినప్పుడు అప్పటికి కొద్దిమంది ఉపాధ్యాయులు, విద్యార్థులు మాత్రమే వచ్చారు. మంత్రి విద్యార్థులకు వండుతున్న మధ్యాహ్న భోజనం పథకం తీరును తనిఖీ చేసారు. సోమవారం మధ్యాహ్న భోజనం మెనూ ఏమిటని నిర్వాహకుడు పి.శ్రీనును మంత్రి ప్రశ్నించారు. విద్యార్థులకు గుడ్లు వండుతున్నామనగా వెంటనే మంత్రి ఉడకబెడుతున్న గుడ్లను స్వయంగా గరెటతో పరిశీలించి గుడ్లు సంఖ్య తక్కువగా ఉందన్న అనుమానం వచ్చిన మంత్రి ఈ రోజు ఎన్ని గుడ్లు పెడుతున్నారని ప్రశ్నిస్తే 300 అని నిర్వాహకుడు సమాధానమిచ్చాడు. అనుమానం వచ్చిన మంత్రి గుడ్లు లెక్కపెట్టించగా 250 ఉన్నాయి. దీంతో మంత్రి నిర్వాహకుడిని తీవ్రంగా మందలించారు. ఆ తరువాత విధులకు ఆలస్యంగా వచ్చిన ఉపాధ్యాయులందరికీ షోకాజ్ నోటీసులు జారీ చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. కాగా ఉదయం 9.20కు ఉపాద్యాయులు పాఠశాలలో ఉండి 9.30 లోపు ప్రార్థన గీతం పూర్తి చేయాలి. ఆ తరువాత తరగతి గదులకు వెళ్ళాలి. ఆ సమయంలో ఉపాధ్యాయులు పూర్తిగా రాలేదు. 9.30 అయినప్పటికీ కొంతమంది ఉపాధ్యాయులు హాజరు కాని తీరును స్వయంగా గమనించారు. వెంటనే జిల్లా విద్యాశాఖాధికారికి కబురుపెట్టగా డిప్యూటీ విద్యాశాఖ అధికారి లింగేశ్వరరెడ్డి, ఆర్‌డిఓ శ్రీనివాసమూర్తి అక్కడికి వచ్చారు. అధికారులు వచ్చిన తరువాత మంత్రి ఆదేశాలతో సిబ్బంది హైస్కూల్ ప్రధాన ద్వారానికి తాళాలు వేయించి తనిఖీలు కొనసాగించారు. హాజరు పట్టీ రికార్డులు పరిశీలించారు. సోమవారం విధులకు ఆలస్యంగా వచ్చిన ఉపాధ్యాయులకు షోకాజ్ నోటీసులు జారీ చేయాలని మంత్రి అధికారులకు ఆదేశించారు.