ఆంధ్రప్రదేశ్‌

ఓటమి భయంతోనే ఉప ఎన్నికలను అడ్డుకున్నారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, అక్టోబర్ 10: రాష్ట్రంలో వైఎస్సార్ కాంగ్రెస్ ఎంపీలు రాజీనామా చేసిన ఐదు పార్లమెంటరీ నియోజకవర్గాల్లో ఓటమి భయంతోనే ఉప ఎన్నికలు జరక్కుండా బీజేపీ, వైసీపీలు కుట్రపన్నాయని ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు విమర్శించారు. ఉప ఎన్నికలు ఎందుకు జరగలేదో ప్రతిపక్షనేత జగన్ ప్రజలకు వివరించాలని బుధవారం ఒక ప్రకటనలో యనమల డిమాండ్ చేశారు. వైసీపీ ఎంపీల కంటే 10రోజులు తరువాత కర్ణాటక ఎంపీలు ముగ్గురు రాజీనామా చేశారని, ఆ స్థానాలకు ఉప ఎన్నికలు జరిగినప్పుడు రాష్ట్రంలో ఎందుకు తాత్సారం చేశారని ప్రశ్నించారు. ఇందులోనే బీజేపీ, వైసీపీల కుమ్మక్కు మరోసారి రుజవైందన్నారు. దీనిపై జగన్ ఎందుకు నోరుమెదపరని నిలదీశారు. ఉప ఎన్నికలు జరక్కుండా రాజీనామాల ఆమోదంలో తాత్సారానికి బాధ్యులెవరని ప్రశ్నించారు. లోక్‌సభ స్పీకర్‌పై ఒత్తిడితెచ్చి 52 రోజులు తాత్సారం అయ్యేలా చేసిందెవరో తేల్చాలన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షా, వైకాపా అధినేత జగన్ కుమ్మక్కు రాజకీయాల వల్లే ఉప ఎన్నికలు రాలేదనే వాస్తవం తేటతెల్లమైందన్నారు. ఈ కుట్రను ఆనాడే తెలుగుదేశం పార్టీ బహిర్గతం చేసిందన్నారు. ఎన్నికల కమిషనర్ ప్రకటనే కుట్రకు నిదర్శనంగా నిలుస్తోందని విమర్శించారు. ఉప ఎన్నికలు జరిగితే డిపాజిట్లు రావనే భయంతోనే అడ్డుకున్నారని, ఏడాది గడువుకు ఒకరోజు తగ్గేలా చూసి ఆమోదించేలా ఒత్తిడి తెచ్చారన్నారు. ఐదు ఎంపీ సీట్లలో ఉప ఎన్నికలు జరిగితే తెలుగుదేశం పార్టీ గెలుస్తుందనే భయంతోనే కుట్ర పన్నారన్నారు. కేంద్రంలో బీజేపీ నేతలు రాజకీయ కుట్రలేకాదు ఆర్థికపరమైన కుట్రలకు కూడా తెరలేపుతున్నారని ధ్వజమెత్తారు. అన్ని హక్కులు ఉన్నప్పటికీ, చట్టాలను సైతం తోసిరాజని తీవ్ర అన్యాయానికి తెగబడుతున్నారని మండిపడ్డారు. వెనుకబడిన జిల్లాలకు రూ 350 కోట్లు ఇంత వరకు వెనక్కు ఇవ్వకపోవటమే ఇందుకు నిదర్శనమన్నారు. తెలంగాణలో 9 జిల్లాలకు రూ 450 కోట్లు విడుదలచేసి, ఏపీలో 7 జిల్లాలకు అన్యాయం చేయటాన్ని ఏమనాలని ప్రశ్నించారు. రెండు రాష్ట్రాల్లో వెనుకబడిన జిల్లాలకు సాయం చేయాలని ఒకే చట్టం చెప్తే ఏపీకి ఇచ్చింది వెనక్కు తీసుకోవటంలోని ఆంతర్యమేమిటని నిలదీశారు. ఇది చట్టరీత్యా సంక్రమించిన ఆర్థిక సాయమని దీనిపై ఆపేహక్కు కానీ, వెనక్కు తీసుకునే హక్కుకానీ కేంద్రానికి లేదన్నారు. చట్టాలను కాలరాసేలా కేంద్రంలోని బీజేపీ నేతలు వ్యవహరించటం గర్హనీయమన్నారు. చట్టానితి తూట్లుపొడిచి రాజకీయ లబ్ది పొందాలనుకుంటే ప్రజాగ్రహానికి గురికాక తప్పదన్నారు. డెవల్యూషన్ దరిమిలా కేంద్రం నుంచి రాష్ట్రాలకు నిధులు రెండువిధాలుగా అందుతాయని తెలిపారు. అన్ని రాష్ట్రాలతో పాటు సమానంగా వచ్చేవాటితో పాటు కేంద్రానికి విచక్షణాధికారం ప్రకారం వచ్చే గ్రాంట్ ఇన్ ఎయిడ్ నిధులు ఇందులో భాగమన్నారు. నిధుల మంజూరులో కేంద్రానికి విచక్షణాధికారం ఉండకూడదని తెలిసీ వివక్ష చూపడం అన్యాయమన్నారు. దీనివల్ల చాలా రాష్ట్రాలకు నష్టం వాటిల్లుతుందని చెప్పారు. బీజేపీయేతర రాష్ట్రాలను అణచివేసే ధోరణిలో కేంద్రం ఉందన్నారు. రాష్ట్ర విభజన సమయంలో ఏపీకి న్యాయం చేయాలని 14వ ఆర్థిక సంఘాన్ని కూడా కోరామని అయితే ప్రయోజనం శూన్యమన్నారు. 15వ ఆర్థిక సంఘం క్రైటేరియా కేంద్రం ముందే నిర్ణయించటం దారుణమన్నారు. సమాఖ్య స్ఫూర్తికి ఇది విరుద్ధమన్నారు. టెర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ (టీవోఆర్) మార్చుకోవాలని ఇప్పటికే పలు రాష్ట్రాల ఆర్థిక మంత్రులు అనేక సమావేశాలు జరిపి డిమాండ్ చేశారని గుర్తుచేశారు.