ఆంధ్రప్రదేశ్‌

మధ్యాహ్న భోజన పథకం బిల్లులు చెల్లించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, అక్టోబర్ 11: రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకం కార్మికులకు నాలుగు నెలలుగా చెల్లించాల్సిన బిల్లులు, వేతనాలు చెల్లించకుండా కార్మికులను అవమానాలకు గురి చేయడం ప్రభుత్వానికి తగదని, తక్షణమే బిల్లులు, వేతనాలు విడుదల చేయాలని ఏఐటీయుసి అనుబంధ ఏపీ మధ్యాహ్న భోజన పథకం వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కే శైలజ, ఎం రమేష్‌లు డిమాండ్ చేశారు. చెల్లించాల్సిన మధ్యాహ్న భోజన పథకం కార్మికుల బిల్లులు, వేతనాలు చెల్లింపుపై గురువారం విద్యాశాఖ కమిషనర్‌ను సంప్రదించారు. అనంతరం వారు మాట్లాడుతూ జూన్ నెల నుండి అక్టోబర్ నెల వరకు ఒక్క రూపాయి కూడా కార్మికులకు బిల్లులు, వేతనాలు చెల్లించలేదని, దీంతో లక్షలాది మంది విద్యార్థులకు వంట ఏ విధంగా చేస్తారని ప్రశ్నించారు.