ఆంధ్రప్రదేశ్‌

మోదీని ప్రశ్నించే ధైర్యం ప్రతిపక్ష నేతలకు లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, అక్టోబర్ 11: ప్రధాని నరేంద్రమోదీని ప్రశ్నించే ధైర్యం రాష్ట్రంలోని ప్రతిపక్ష నేతలకు లేదని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సాదినేని యామిని ఎద్దేవా చేశారు. అభివృద్ధిలో, ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడంలో ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందిన ముఖ్యమంత్రి చంద్రబాబుపై మాత్రం ప్రతిపక్షాలు అర్థం పర్థంలేని ఆరోపణలు చేయడం బట్టకాల్చి ముఖంపై వేసినట్లుగా ఉందని విజయవాడలోని పార్టీ కార్యాలయంలో గురువారం జరిగిన విలేఖర్ల సమావేశంలో యామిని అన్నారు. ఆధారాలు లేకుండా ముఖ్యమంత్రిపై, రాష్ట్ర ప్రభుత్వ పనితీరుపై ఆరోపణలు చేయడం మానుకోవాలని, 5 లక్షల కోట్ల అవినీతి జరిగిందని ఆరోపణలు చేసిన విజయసాయిరెడ్డి, ప్రతిపక్ష నేత జగన్ తమపై ఉన్న అవినీతి కేసులు గురించి ప్రజలకు ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. జగన్‌కు సంబంధించిన 2వేల కోట్ల ఆస్తులను ఈడీ అటాచ్ చేసిందని, ప్రతి శుక్రవారం సీబీఐ కోర్టుకు హాజరయ్యే వ్యక్తి ప్రజల కోసం పని చేసే ప్రభుత్వంపై నిస్సిగ్గుగా ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. ఫ్యాక్ట్‌ఫైండింగ్ కమిటీ ద్వారా రూ. 74,700 కోట్లు రాష్ట్రానికి రావాలని గతంలో చెప్పిన పవన్ కళ్యాణ్ ఆ విషయంపై కేంద్రాన్ని ఎందుకు ప్రశ్నించడం లేదన్నారు. సీఎం పదవి గురించి రోజుకోరకంగా మాట్లాడే పవన్ రోజుకు 18 గంటలు ప్రజల కోసం పని చేసే సీఎం చంద్రబాబు పై ఆరోపణలు చేయ డం బాధాకరన్నారు. రాష్ట్రం గురించి అసలు ఏ మాత్రం అవగాహనలేని బీజేపీ ఎంపీ జీవీఎల్, రాష్ట్ర బీజేపీ నేతలు రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకోవడమే ధ్యేయంగా పని చేస్తున్నారన్నారు.