ఆంధ్రప్రదేశ్‌

జీఎస్టీ విధానంలో జోక్యం చేసుకోలేం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, అక్టోబర్ 12: జీఎస్టీ విధానంలో తాము జోక్యం చేసుకోలేమని 15వ ఆర్థిక సంఘం చైర్మన్ నంద్‌కిశోర్ సింగ్ స్పష్టం చేశారు. వెలగపూడి సచివాలయంలో నగరపాలక సంస్థలు, పురపాలక సంఘాలకు చెందిన ప్రజాప్రతినిధులతో శుక్రవారం ఆయన సమావేశమయ్యారు. నగరపాలక సంస్థలు, పురపాలక సంఘాల అవసరాలు, నిధుల కేటాయింపులపై అభిప్రాయాలను సేకరించారు. ఈసందర్భంగా సింగ్ మాట్లాడుతూ వినోదపు పన్నుకు జీఎస్టీ నుంచి మినహాయింపు ఇవ్వాలని జీఎస్టీ కౌన్సిల్ దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు. విజయవాడ నగర మేయర్ కోనేరు శ్రీ్ధర్ మాట్లాడుతూ జీఎస్టీ పరిధిలోకి వినోదపు పన్ను చేర్చడం వల్ల విజయవాడ నగరపాలక సంస్థ 18కోట్ల రూపాయల మేర నష్టపోయిందని తెలిపారు. రాష్టవ్య్రాప్తంగా దాదాపు 130కోట్ల రూపాయలను వివిధ నగరపాలక సంస్థలు నష్టపోయాయని చెప్పారు. జీఎస్టీ ద్వారా వచ్చిన ఆదాయంలో నగరపాలక సంస్థలకూ వాటా కేటాయించేలా చర్యలు తీసుకోవాలన్నారు. రాష్ట్ర విభజన తరువాత విజయవాడ ప్రాధాన్యత పెరిగిందని, కానీ ఆదాయం తగ్గడంతో నిర్వహణ భారంగా మారిందన్నారు. అనంతపురం నగరపాలక సంస్థ మేయర్ ఎం స్వరూప మాట్లాడుతూ విభజనతో ఏపీ అన్నివిధాలుగా నష్టపోయిందన్నారు. 14వ ఆర్థిక సంఘం నుంచి ఆశించిన విధంగా నిధులు రాలేదన్నారు. తాడేపల్లి మున్సిపల్ చైర్‌పర్సన్ కె మహాలక్ష్మి మాట్లాడుతూ మున్సిపాలిటీలకు జనాభా ప్రాతిపదికన కాకుండా విస్తీర్ణం ఆధారంగా నిధులు కేటాయించాలని సూచించారు. రాష్ట్ర విభజనతో మున్సిపాలిటీల నిర్వహణ కష్టతరంగా మారిందన్నారు. గుడివాడ మున్సిపల్ చైర్మన్ శ్రీనివాసరావు మాట్లాడుతూ 2011 జనాభా లెక్కల ప్రాతిపదికన కాకుండా 1971 జనాభా ఆధారంగా రాష్ట్రాలకు నిధులు కేటాయించాలన్నారు. దీనిపై ఆర్థిక సంఘం చైర్మన్ స్పందిస్తూ ఈ అంశాలన్నీ కౌన్సిల్ దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. ఆదాయం పెంచుకునే మార్గాలు సృష్టించుకోవాలని సూచించారు. ఆస్తిపన్ను పెంచాలన్న ఆర్థిక సంఘ సభ్యుల సూచన సాధ్యంకాదని ప్రజాప్రతినిధులు స్పష్టం చేశారు. ఎక్కువ నిధులిచ్చి తమను ఆదుకోవాలని వారు కోరారు.