ఆంధ్రప్రదేశ్‌

గిరిజన ఉత్పత్తుల విక్రయాలకు 100 రిటైల్ షాపులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, అక్టోబర్ 12: గిరిజన ఉత్పత్తులను పట్టణ ప్రాంత వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చేందుకు రాష్టవ్య్రాప్తంగా 100 రిటైల్ షాపులు ఏర్పాటు చేయనున్నట్లు రాష్ట్ర సాంఘిక, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి నక్కా ఆనందబాబు వెల్లడించారు. వెలగపూడి సచివాలయం మూడో బ్లాక్‌లో గిరిజన సహకార సంస్థ (జీసీసీ) ఏర్పాటు చేసిన రిటైల్ స్టాల్‌ను శుక్రవారం ఆయన ప్రారంభించారు. ఈసందర్భంగా మంత్రి మాట్లాడుతూ పట్టణ ప్రాంతాల్లోని కూడళ్లు, ప్రభుత్వ కార్యాలయాల్లో రిటైల్ షాపులు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. గత ఏడాది జీసీసీ 307 కోట్ల రూపాయల మేర వ్యాపారం చేసిందని, ఈ ఏడాది 500 కోట్ల రూపాయల మేర వ్యాపారం చేయాలని లక్ష్యంగా నిర్ణయించుకున్నామన్నారు. ప్రకృతిసిద్ధంగా లభించే గిరిజన ఉత్పత్తుల అమ్మకాలు, బ్రాండింగ్, మార్కెటింగ్ ప్రక్రియలపై దృష్టి సారించామన్నారు. అరకు కాఫీ ఉత్పత్తులకు జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లలో గుర్తింపు మరింతగా తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. విజయవాడ, శ్రీకాకుళం జిల్లాల్లోని రైతుబజార్లలో స్టాల్స్ ఏర్పాట్లు పూర్తి కావచ్చిందన్నారు. అమ్మకాలు పెంచడం వల్ల గిరిజనుల ఆదాయం పెరుగుతుందన్నారు. ఈ స్టాల్స్‌లో గిరిజన యువతను నియమించినున్నట్లు మంత్రి ఆనందబాబు వివరించారు. ఈ సమావేశంలో జీసీసీ ఎండీ బాబూరావు నాయుడు, తదితరులు పాల్గొన్నారు.