ఆంధ్రప్రదేశ్‌

ఏనుగుల బీభత్సం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సీతంపేట, జూలై 11: శ్రీకాకుళం జిల్లా సీతంపేట ఏజెన్సీతో పాటు మైదాన ప్రాంతాల్లో సంచరిస్తున్న ఏనుగులు గిరిజనులు, మైదాన ప్రాంతవాసులకు కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాయి. సీతంపేట, కొత్తూరు, హిరమండలం, ఎల్‌ఎన్‌పేట మండలాల్లో స్వైరవిహారం చేస్తున్న ఏనుగుల గుంపు పంటలకు కూడా తీవ్రంగా నష్టం కలిగిస్తున్నాయి. ఏనుగులు సంచరిస్తున్న ఈ నాలుగు మండలాల్లో నివసిస్తున్న ప్రజలు రాత్రిపూట ఎటువైపూ వెళ్లలేని పరిస్థితి నెలకొంది. గత కొన్ని రోజులుగా సీతంపేట మన్యంలో సంచరిస్తున్న ఏనుగులు కడగండి పంచాయతీ పరిధిలోని భూచెంద్రి, కడగండి వలస, గజిలి సమీపంలో సంచరిస్తుండడంతో గిరిజనులు భీతిల్లుతున్నారు. సోమవారం సాయంత్రం ఏనుగులు కడగండివలస-్భచెంద్రి రహదారి పైకి రావడంతో వాహనాల రాకపోకలు ఎక్కడివక్కడే నిలిచిపోయాయి. ఏనుగులు రహదారిపైకి వచ్చి చాలా సేపు తిరగడంతో ఆర్‌టిసి బస్సులు కూడా నిలిచిపోయాయి. గుంపులో ఉన్న నాలుగు ఏనుగుల్లో రెండు ఏనుగులు రహదారిపై సంచరించగా మిగిలిన రెండు భూచెంద్రి పరిసరాల్లో తిరుగాడడంతో గిరిజనులు ఇళ్ల నుండి బయటకు రాలేకపోయారు.