ఆంధ్రప్రదేశ్‌

అవమానించడం కాంగ్రెస్‌కు అలవాటే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, అక్టోబర్ 15: దక్షిణ భారతీయులను అవమానించడం కాంగ్రెస్ నేతలకు అలవాటుగా మారిందని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. సోమవారం గుంటూరులోని తన స్వగృహంలో ఏర్పాటుచేసిన విలేఖర్ల సమావేశంలో కన్నా మాట్లాడుతూ పంజాబ్ మంత్రి నవజ్యోతిసింగ్ సిద్ధూ దక్షిణ భారతదేశానికి వెళ్లడం కంటే పాకిస్థాన్‌కు వెళ్లడమే నయమని వ్యాఖ్యానించడాన్ని ఆయన ఖండించారు. మాజీ ప్రధాని పీవీ నరసింహారావు మరణించిన తర్వాత ఆయనకు స్మృతివనం ఏర్పాటు చేయకుండా కాంగ్రెస్ అడ్డుకుందని, ఆయన భౌతికకాయాన్ని హైదరాబాద్‌కు పంపించారన్నారు. దక్షిణ భారతీయులను అవమానించిన సిద్ధూ, ఆయనకు వత్తాసు పలుకుతున్న కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాలని కన్నా డిమాండ్ చేశారు. ఇలాఉంటే రాష్ట్రంలో గతంలో ఎన్నడూ ఐటీ దాడులు జరగనట్లుగా టీడీపీ నేతలు వ్యాఖ్యానించడం విడ్డూరంగా ఉందన్నారు. పన్నులు చెల్లించకూడదని రాజ్యాంగంలో లేదు కదా అని కన్నా ప్రశ్నించారు. ప్రతి విషయాన్ని రాజకీయంగా వాడుకోవడం టీడీపీ నేతలకు పరిపాటిగా మారిందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు రాజ్యాంగబద్ధమైన సంస్థలను అవమానించే రీతిలో వ్యాఖ్యానించడం ఆయన నైజాన్ని తెలియజేస్తోందన్నారు. మహారాష్టల్రోని ధర్మాబాద్ పోలీసులు టీడీపీ నేతలపై 2013లో కేసు నమోదు చేశారని, ఈ అంశంపై హైకోర్టు 37 సార్లు నోటీసులు జారీచేస్తే హాజరుకాకపోగా, ఇది కుట్రగా వర్ణించడం చంద్రబాబుకే చెల్లుతుందన్నారు. ముఖ్యమంత్రిగా ఉండే అర్హత చంద్రబాబు కోల్పోయారని, ఈ విషయంపై గవర్నర్‌కు తాము ఫిర్యాదు చేయనున్నట్లు వెల్లడించారు. గతంలో ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాలరెడ్డికి చెందిన వ్యాపార సంస్థలపై హైదరాబాద్, బెంగళూరు, గుంటూరులలో ఐటీ దాడులు జరిగినప్పుడు ఆ పార్టీ నాయకులు స్పందించకపోగా ఇప్పుడెందుకు గగ్గోలు పెడుతున్నారని కన్నా లక్ష్మీనారాయణ ప్రశ్నించారు. టీడీపీ నేతలు తాము చేసిన తప్పులను ఒప్పులుగా చూపాలనే ప్రయత్నాలను ప్రజలు విశ్వసించరన్నారు. ఐటీ దాడులకు, బీజేపీకి సంబంధమేంటని ప్రశ్నించారు. ఈనెల 16వ తేదీ కేంద్ర హోం మంత్రి రాజనాథసింగ్ గుంటూరులో ఎస్సీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవంలో పాల్గొంటారన్నారు. ఇదే వేదికపై నుండి మంగళగిరిలో నిర్మించనున్న భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయానికి రిమోట్ ద్వారా రాజనాథ్‌సింగ్ శంకుస్థాపన చేయనున్నారని తెలిపారు. ఈ సమావేశంలో బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జమ్ముల శ్యామ్‌కిషోర్, ఎస్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు సత్యనారాయణరెడ్డి, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తురగా నాగభూషణం, కోశాధికారి సన్యాసిరాజు, బిల్డింగ్ కమిటీ చైర్మన్ ఆర్ లక్ష్మీపతి, నగర అధ్యక్షుడు అమ్మిశెట్టి ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.

చిత్రం..విలేఖరుల సమావేశంలో మాట్లాడుతున్న కన్నా లక్ష్మీనారాయణ