ఆంధ్రప్రదేశ్‌

వరికి హెక్టారుకు రూ. 20 వేల నష్టపరిహారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, అక్టోబర్ 15: శ్రీకాకుళంలో తిత్లీ తుపాను కారణంగా దెబ్బతిన్న పంటలకు నష్టపరిహారాన్ని రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ప్రకటించింది. మృతులకు 5 లక్షల రూపాయలు, వరికి హెక్టారుకు 20 వేల రూపాయలు, అరటి పంటకు 30 వేల రూపాయలు, కొబ్బరి చెట్టుకు 1200 రూపాయలు, జీడిమామిడికి హెక్టారుకు 25 వేల రూపాయలు ప్రకటించింది. పూర్తిగా పాడైన మెకనైజ్డ్ బోట్లకు 6 లక్షల రూపాయలు, వలలకు 10 వేల రూపాయలు, వలలను, బోట్లను కొనుగోలు చేసేందుకు 50 శాతం రాయితీని గరిష్ఠంగా 3 లక్షల రూపాయలను, అక్వా కల్చర్‌కు ఇన్‌పుట్ సహాయంగా 30 వేల రూపాయలు చెల్లించేందుకు నిర్ణయించింది. మృతి చెందిన గోర్రె, మేకకు 3 వేల రూపాయలు, పాడైన ఇళ్ళకు 10 వేల రూపాయల చొప్పున నష్టపరిహారం చెల్లించనుంది.