ఆంధ్రప్రదేశ్‌

‘తిత్లీ’ని ప్రచారానికి వాడుకుంటున్న బాబు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, అక్టోబర్ 21: తిత్లీ తుపానును కూడా తమకు అనుకూల ప్రచారంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వాడుకుంటున్నారని ఎమ్మెల్సీ మాధవ్ అన్నారు. స్థానిక బీజేపీ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తిత్లీ తుపానులో రాష్ట్ర ప్రభుత్వం చేసిన సహాయం కొంతమందికి మాత్రమే అందిందని అన్నారు. చాలా గ్రామాల్లో ఇప్పటికీ తాగునీరు, విద్యుత్ సరఫరా పునరుద్ధరించ లేకపోయారని అన్నారు. విపత్తు నుంచి లాభం పొందాలి, దాన్ని ఆధారంగా ప్రచారం చేసుకోడానికే చంద్రబాబు అట్టహాసం చేస్తున్నారని అన్నారు. ఇదే సమయంలో నరేంద్రమోదీని దోషిగా నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. చంద్రబాబు దిగజారుడుతనానికి నిదర్శనమని అన్నారు. మోదీపై వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని మాధవ్ డిమాండ్ చేశారు. తుపాను బాధితులకు సహాయం చేసేందుకు శ్రీకాకుళం జిల్లాకు ఎవరైనా వెళితే, చంద్రబాబు హోర్డింగ్ చూసి అందరూ ఏవగించు కుంటున్నారని అన్నారు. బాధితులకు సహాయం చేయడానికి చంద్రబాబు హుటాహుటిన శ్రీకాకుళం జిల్లాకు వెళ్లారు. కానీ అందరికీ సహాయం అందిందంటే లేదనే చెప్పాలి. ఇప్పటికీ చాలా గ్రామాలు చీకటిలో మగ్గుతున్నాయని, తాగడానికి చుక్క నీరు కూడా లభించని పరిస్థితి ఉందని మాధవ్ అన్నారు. తమకు సహాయం అందలేదని అడిగిన వారిని అరెస్ట్ చేయించడం ఎంతవరకూ సమంజసమని మాధవ్ ప్రశ్నించారు. హుదూద్‌లో విశాఖకు జరిగిన నష్టం కన్నా, శ్రీకాకుళం జిల్లాకు తిత్లీ వలన ఎక్కువగానే జరిగిందని అన్నారు. ఇంత విపత్తును కూడా సీఎం రాజకీయం చేయాలనుకోవడం సరికాదని ఆయన అన్నారు. తుపాను బాధితులకు కేంద్రం సహాయం చేయడం లేదని చంద్రబాబు ఆరోపణల్లో వాస్తవం లేదని అన్నారు. తుపాను నష్టాన్ని అంచనా వేసేందుకు కేంద్ర బృందం వస్తుందని, ఇప్పటికే జరిగిన నష్టంపై ఒక నివేదికను ప్రధానికి అందించామని చెప్పారు. హుదూద్ నష్టాన్ని అంచనా వేసేందుకు తుపాను సంభవించిన తరువాత కేంద్ర బృందం సభ్యులు రెండు నెలలకు వచ్చారని ఆయన గుర్తు చేశారు. ఈ విలేఖరుల సమావేశంలో బీజేపీ నగర అధ్యక్షుడు నాగేంద్ర పాల్గొన్నారు.

చిత్రం..విలేఖరుల సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్సీ మాధవ్