ఆంధ్రప్రదేశ్‌

హంద్రీ-నీవా పనులకు నిధుల గండం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం, జూలై 13: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హంద్రీ-నీవా సుజల స్రవంతి (హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్) కాలువ పనులకు నిధుల గండం ఏర్పడింది. హంద్రీ-నీవాను ఈ ఏడాది ఆగస్టు 31 నాటికల్లా పూర్తిచేయాలని ప్రభుత్వం కాంట్రాక్టు కంపెనీలకు ఆదేశాలిచ్చింది. అయితే ఫేజ్-1, ఫేజ్-2కు సంబంధించి అనంతపురం, మదనపల్లి(చిత్తూరు జిల్లా), కర్నూలు జిల్లాల పరిధిలో చేసిన పనుల బిల్లులు రూ.139 కోట్ల వరకు పెండింగ్‌లో ఉన్నాయి. ప్రభుత్వం రూ.480 కోట్ల బడ్జెట్ హంద్రీ-నీవాకు కేటాయించింది. ఇందులో ఇప్పటి వరకు రూ.380 కోట్లు పూర్తయిన వివిధ పనులకు గాను కాంట్రాక్టర్లకు చెల్లించింది. ఈ ఏడాది ద్వితీయ త్రైమాసికంలో రూ.139 కోట్లు విడుదల కావాల్సి ఉన్నా ప్రతిష్టంభన ఏర్పడింది. ముఖ్యమంత్రి విదేశీ పర్యటన నుంచి తిరిగి రాగానే పెండింగ్ బిల్లుల నిధుల విడుదలకు చర్యలు తీసుకోనున్నట్లు సమాచారం. కాగా గత ఏడాది కూడా ఇలాగే బిల్లులు చెల్లించడంలో ప్రభుత్వం జాప్యం చేయడంతో పనులు స్తంభించాయి. గత త్రైమాసికానికి సంబంధించి రూ.200 కోట్ల బిల్లులు పెండింగ్ పడ్డాయి. తర్వాత ఆలస్యంగా నిధులు విడుదల చేయడంతో అధికారులు ఈ ఏడాది మార్చి, ఏప్రిల్ వరకు పనులు చేస్తూ నెట్టుకొచ్చారు. అయితే ఫేజ్-1, ఫేజ్-2కు సంబంధించి ఈ ఏడాది ద్వితీయ త్రైమాసికంలో విడుదల కావాల్సిన రూ.139 కోట్ల బిల్లులకు ఇప్పటికీ మోక్షం కలగలేదు. ఇందులో అనంతపురం సర్కిల్‌కు రూ.75 కోట్లు చెల్లించాల్సి ఉంది.