ఆంధ్రప్రదేశ్‌

సబ్బం కోసం ఆ ఇద్దరు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్,జూలై 13: ఉత్తరాంధ్రలో బలమైన వెలమ వర్గ నేత కోసం టిడిపి, బిజెపి అనే్వషిస్తున్నాయి. ఇప్పటికే వైసీపీకి ధర్మాన సోదరులు, టిడిపికి అయ్యన్న, అచ్చెన్నాయుడు ఉన్నప్పటికీ, విశాఖ కార్పొరేషన్ ఎన్నికల నాటికి మరో బలమైన వెలమ నేత కోసం రెండు పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. అందులో భాగంగా అనకాపల్లి మాజీ ఎంపి, విశాఖ మాజీ మేయర్ సబ్బం హరిని తమ పార్టీల్లో చేర్చుకునే ప్రయత్నాలను ముమ్మరం చేసినట్లు సమాచారం. ఈ విషయంలో తెలుగుదేశం పార్టీ తొందరపడుతున్నట్లు కనిపిస్తోంది. విశాఖ కార్పొరేషన్ ఎన్నికలను టిడిపి ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. సమైక్యాంధ్ర ఉద్యమంలో కీలకపాత్ర పోషించి, గత పార్లమెంటు ఎన్నికల్లో ఆయన వైదొలగడం వల్ల విజయలక్ష్మి ఓటమి పాలవడం, విశాఖలో క్లీన్ ఇమేజ్‌తోపాటు, వ్యక్తిత్వం ఉన్న వివాదరహిత నేతగా ముద్రపడిన హరి, తమ పార్టీలో చేరితే విశాఖ కార్పొరేషన్ ఎన్నికల్లో తిరుగు ఉండదని టిడిపి నాయకత్వం భావిస్తోంది. హరి మేయర్‌గా పనిచేసిన కాలం కంటే ఇప్పుడు కార్పొరేషన్ పరిథి పెరగడం, వెలమ సామాజికవర్గంలో పట్టు ఉండటంతో మేయర్ అభ్యర్ధిగా సబ్బం సరైన నాయకుడిగా అంచనా వేస్తోంది. అందులో భాగంగా ఆయనను తమ పార్టీలో చేరాలని సబ్బం హరి సన్నిహితుల ద్వారా ప్రయత్నాలు ప్రారంభించింది. ఇటీవలి విధానమండలి ఎన్నికల ముందు కూడా, పార్టీలో చేరితే ఎమ్మెల్సీ ఇస్తామని ఆఫర్ ఇచ్చినా, ఆయన సున్నితంగా తిరస్కరించినట్లు ఆయన సన్నిహితుల సమాచారం. సబ్బం హరి పార్టీలో చేరితే విశాఖ కార్పొరేషన్ పరిథిలో పాటు, ఉత్తరాంధ్రలో బలమైన వెలమ సామాజికవర్గం కూడా పార్టీ వైపు మళ్లుతుందన్న అంచనా టిడిపి నాయకత్వంలో ఉంది. బిజెపి కూడా ఇదే అంచనాతో సబ్బం కోసం ప్రయత్నాలు ప్రారంభించింది. సబ్బం హరితోపాటు, మాజీ మంత్రి దాడి వీరభద్రరావును కూడా పార్టీలో చేర్చుకుంటే ఉత్తరాంధ్రలో వెలమ, గవర కులాలను ఆకట్టుకోవచ్చన్న యోచనతో ఉంది. ఇప్పటికే బిజెపి ప్రముఖులు ఆయన సన్నిహితులతో చర్చించినట్లు సమాచారం. పార్టీ అధినేత అమిత్‌షా ఆదేశాల మేరకు ఇతర పార్టీలకు చెందిన ప్రముఖులను బిజెపిలో చేర్చుకునే వ్యవహారానికి నాయకత్వం పదునుపెట్టింది. పైగా విశాఖలో ఒక ఎంపి, ఒక ఎమ్మెల్యే బలం ఉన్నందున సబ్బం హరి కూడా చేరితే విశాఖ జిల్లాలో పార్టీ బలమైన శక్తిగా ఎదుగుతుందన్న అంచనా ఉంది. సబ్బం వంటి ఉన్నత విలువలు, సిద్ధాంతాలున్న నేత పార్టీలో చేరితే, తటస్థులు కూడా పార్టీలో చేరతారన్న అంచనాతో ఉంది. ఏ పార్టీలోనూ చేరకుండా, సిద్ధాంతాలకు కట్టుబడి ఉన్న హరి వ్యక్తిత్వమే బిజెపిని ఆయన వైపు చూసేలా చేసిందంటున్నారు. టిడిపి, బిజెపికి చెందిన ఇద్దరు అగ్రనేతలు ఇప్పటికే ఆయనతో మాట్లాడారు. ఈ క్రమంలో సబ్బం ఏ పార్టీలో చేరతారో చూడాలి.

లారీ ఢీకొని ముగ్గురు మృతి
ఆంధ్రభూమి బ్యూరో
ఖమ్మం, జూలై 13: ఖమ్మం జిల్లా వేంసూరులో అదుపుతప్పి లారీ ఢీకొన్న సంఘటనలో ముగ్గురు వ్యక్తులు మృతి చెందిన సంఘటన బుధవారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. సత్తుపల్లి నుంచి విజయవాడ వైపు వెళ్తున్న లారీ మండల కేంద్రమైన వేంసూరులో రోడ్ల వెంట చిరువ్యాపారం చేసుకుంటున్న వేంసూరుకు చెందిన సంకటి కృష్ణమూర్తి(70), షేక్ మహబూబ్ అలీ(70), కోట నాగరత్నం(80) ప్రమాదవశాత్తు లారీ ఢీకొనటంతో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా, మరొకరు ఆసుపత్రి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందారు. లారీ సత్తుపల్లి నుంచి విజయవాడ వైపు వెళ్తుండగా వేంసూరు సెంటర్ వద్ద లారీ బ్రేక్‌లు ఫెయిలవ్వటంతో ఈ సంఘటన జరిగింది. మహబూబ్ అలీ, నాగరత్నంల మీదుగా లారీ దూసుకెళ్ళటంతో వారి అవయవాలు చెల్లాచెదురుగా పడిపోయాయి. కాగా సంఘటన స్థలాన్ని సత్తుపల్లి డిఎస్పీ రాజేష్, సిఐలు రాజిరెడ్డి, తహశీల్దార్ వేణుగోపాల్ సంఘటన స్థలాన్ని పరిశీలించారు. సంఘటనపై ఎస్‌ఐ వెంకటేశ్వర్లు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా లారీ డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ప్రముఖ రచయిత గూటాల కన్నుమూత
ఆంధ్రభూమి బ్యూరో
విశాఖపట్నం, జూలై 13: ప్రముఖ రచయిత, ఆంగ్ల భాషా ప్రవీణుడు గూటాల కృష్ణమూర్తి (88) బుధవారం విశాఖలో కన్నుమూశారు. ఆయన గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. విశాఖ నగరంలోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన మృతి చెందారు. దశాబ్దాల కిందటే లండన్ వెళ్లి స్థిరపడిన గూటాల ప్రస్తుతం విశాఖలో ప్రశాంత జీవనం గడుపుతున్నారు. గూటాల ఒడిశా రాష్ట్రం పర్లాకిమిడిలో 1928లో జన్మించారు. ఆయనకు భార్య వెంకటరమణ, ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. ప్రాథమిక విద్యను విజయనగరంలో అభ్యసించిన గూటాల విశాఖ ఎవిఎన్ కళాశాల, ఆంధ్రవిశ్వవిద్యాలయంలో ఉన్నత చదువు అభ్యసించారు. ఆంగ్ల సాహిత్యంలో ఆనర్స్ పూర్తి చేశారు. మూడేళ్ల పాటు తూర్పుగోదావరి జిల్లా ఎస్‌కెబిఆర్ కళాశాలలో అధ్యాపకునిగా పనిచేసిన గూటాల ప్రస్తుత ఛత్తీస్‌గడ్ రాష్ట్రం బిలాస్‌పూర్ కళాశాలలో మూడేళ్ల పాటు అధ్యాపకునిగా సేవలందించారు. 1962లో లండన్ వెళ్లిపోయిన గూటాల అక్కడే స్థిరపడ్డారు.

సంగమేశ్వరం-శ్రీశైలం మధ్య బోటు షికారు
ఆంధ్రభూమి బ్యూరో
కర్నూలు, జులై 13: కర్నూలు జిల్లాలో పర్యాటకరంగాన్ని ప్రోత్సహించే క్రమంలో భాగంగా సప్తనదుల సంగమేశ్వరం నుంచి శ్రీశైలం వరకు ఫెర్రీ బోట్లను సిద్ధం చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ విజయమోహన్ వెల్లడించారు. ఇందుకోసం 18 సీట్ల సామర్థ్యం గల రెండు బోట్లను కొనుగోలు చేస్తున్నామన్నారు. వీటిని పుష్కరాల నాటికి సంగమేశ్వరం, శ్రీశైలం మధ్య నడుపుతామన్నారు. బుధవారం కర్నూలు కలెక్టరేట్‌లో ఆయన విలేఖరులతో మాట్లాడుతూ శ్రీశైలం జలాశయం నీటిమట్టం 855 అడుగుల మేర ఉన్నంతకాలం బోట్లు నడుపుతామన్నారు. సప్తనదుల సంగమస్థలిలో చారిత్రాత్మక దేవాలయ దర్శనం తరువాత భక్తులు శ్రీశైలం వెళ్లవచ్చని, అలాగే శ్రీశైలంలో మల్లన్న దర్శనం అనంతరం సంగమేశ్వరం రావడానికి అవకాశముంటుందన్నారు. నల్లమల అడవిలో ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ బోటులో ప్రయాణించడం పర్యాటకులకు ప్రత్యేక అనుభూతిని మిగులుస్తుందన్నారు. సంగమేశ్వరం నుంచి ఆత్మకూరు వచ్చే మార్గంలో దేశంలోనే మూడవదైన సరస్వతీక్షేత్రం కొలనుభారతిని సైతం దర్శించుకునే వీలుందని తెలిపారు. తిరుమల తరహాలో శ్రీశైలం అభివృద్ధికి ప్రణాళిక సిద్ధమైందన్నారు. అప్పుడు శ్రీశైలంలో ఆలయ పూజారులు మాత్రమే నివాసముంటారని, ఇతరులను సున్నిపెంటకు తరలిస్తామన్నారు.
తపాలాశాఖ ద్వారా కృష్ణా పుష్కర జలాలు
ఆంధ్రభూమి బ్యూరో
భీమవరం, జూలై 13: వచ్చే నెలలో జరగనున్న కృష్ణా పుష్కరాలకు తపాలాశాఖ తన వంతు సేవలను అందించేందుకు నడుం బిగించింది. గోదావరి పుష్కరాల మాదిరిగానే కృష్ణా పుష్కరాల్లో కూడా పవిత్రమైన జలాలను భక్తులకు అందించడానికి ఏర్పాట్లుచేసింది. 500 మి.లీ బాటిల్ జలాలను రూ.30కి అందించనుంది. ఆగస్టు 12 నుంచి కృష్ణా పుష్కరాలు ప్రారంభం కానున్న సంగతి విదితమే. ఈ నెల 15 నుంచి ఆగస్టు 5వ తేదీ వరకు పుష్కర జలాలకు బుకింగ్ చేసుకుంటారు. ఆగస్టు 23వ తేదీ నాటికి బాటిల్స్ బట్వాడాచేస్తారు. భక్తులకు అందించే పుష్కర జలాలను 14స్ధాయిల్లో ఫిల్టర్ చేసి అందిస్తారు. తపాలాశాఖ ఏపి సర్కిల్ పరిధిలోని విజయవాడ, కర్నూలుల్, విశాఖపట్టణం రీజియన్ పరిధిలోని ఒక్కో హెడ్ పోస్ట్ఫాసుకు 100, సబ్ పోస్ట్ఫాసుకు 50, బ్రాంచ్ పోస్ట్ఫాసుకు 25 వంతు బాటిల్స్ కేటాయించారు. తపాలా కార్యాలయాల్లో పేర్లు నమోదు చేసుకున్న వారికి స్పీడ్ పోస్టు ద్వారా పుష్కర జలాల బాటిళ్లు పంపిస్తారు. గోదావరి పుష్కరాల్లో పవిత్రమైన పుష్కర జలాలను భారతీయులతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులందరికీ పంపించారు. కృష్ణా పుష్కరాలకు సంబంధించి జలాలను దేశంలో మాత్రమే అందించనున్నారు.
మైనర్లకు మద్యం విక్రయిస్తే జైలే
తిరుమల, జూలై 13: 21 సంవత్సరాలు కన్నా వయస్సు తక్కువున్న వారికి మద్యం దుకణాలుకానీ, బార్లలో కానీ మద్యం విక్రయిస్తే ఆ సంబంధిత వ్యాపారుల లైసెన్సులు రద్దుచేయడమే కాకుండా యజమానులపై కఠినచర్యలు తీసుకుంటామని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర హెచ్చరించారు. బుధవారం విరామ సమయంలో ఆయన తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన ఆలయం వెలుపల విలేఖరులతో మాట్లాడారు. హైదరాబాద్‌లో చిన్నారి రమ్య మరణానికి కారకులపై చర్యలు తీసుకోవాలని వస్తున్న డిమాండ్ నేపధ్యంలో ఈవిధమైన నిర్ణయం తీసుకున్నామన్నారు.దుకాణాల్లో, బార్లల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయించి 21 సంవత్సరాల లోపు పిల్లలు మధ్యం దుకాణాల్లో మద్యం వారికి విక్రయించకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రభుత్వం నిర్దేశించిన ఎమ్మార్పీ ధరలను మించి విక్రయిస్తే రూ.5 లక్షల అపరాధ రుసుం వసూలుచేసేలా చర్యలు తీసుకుంటామన్నారు.
ప్రత్యేక హోదాతోనే రాష్ట్భ్రావృద్ధ్ది
తిరుమల, జూలై 13: విభజన నేపథ్యంలో ఎన్నో ఆర్థిక ఒడిదుడుకులకు గురైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ప్రత్యేక హోదా కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఎస్సీ, ఎస్టీ కార్పొరేషన్ చైర్మన్ కారెం శివాజి అన్నారు. బుధవారం విరామ సమయంలో ఆయన స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయం వెలుపల విలేఖరులతో మాట్లాడారు. ప్రత్యేక హోదా పట్ల కేంద్రం ప్రత్యేక దృష్టి పెట్టి ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. విభజన అడ్డదిడ్డంగా జరిగిన నేపథ్యంలో విభజన చట్టంలో ఉన్న అంశాలను కేంద్ర ప్రభుత్వం అమలుచేయకపోవడం మరిన్ని సమస్యలు తలెత్తుతున్నాయన్నారు. ఈ క్రమంలో రాష్ట్రానికి ప్రత్యేక హోదాను కేంద్రప్రభుత్వం ఇవ్వాల్సిందేనన్నారు. నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు పెరగాలన్నా, పరిశ్రమల అభివృద్ధి అనివార్యమన్నారు. ఒక ప్రత్యేక హోదా నిర్ణయంతో ఈ సమస్యలన్నింటికీ పరిష్కారం లభిస్తుందన్నారు. టిటిడి, ఎస్వీయూ, వేదిక్ లాంటి విశ్వవిద్యాలయాల్లో ఎస్సీ ఎస్టీ బ్యాక్‌లాగ్ పోస్టుల భర్తీకి అధికారులతో క్షుణ్ణంగా చర్చించి నియామకాలకు స్పష్టమైన ఆదేశాలిచ్చామన్నారు.