ఆంధ్రప్రదేశ్‌

విద్యుత్ ఒప్పందాలు రద్దు చేయండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 13: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అదనంగా విద్యుత్ ఉత్పత్తి చేయాల్సిన అవసరం లేకపోయినా, రెండు విద్యుత్ ప్లాంట్లకు లైసెన్సులు ఇవ్వడం, విద్యుత్ కొనుగోలుకు ప్రభుత్వ నిధులు వెచ్చించడం అనవసరమని, విద్యుత్‌ప్లాంట్లతో కొనుగోలు ఒప్పందాలను రద్దు చేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ డిమాండ్ చేసింది. బుధవారం ఇక్కడ ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్, వైకాపా ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో విద్యుత్ కొరత లేదని, కాని అదనపు విద్యుత్ కోసం ప్రభుత్వ నిధులు వెచ్చించడం వెనక మతలబు ఏమిటని ప్రశ్నించారు. ఈ రేట్లు కూడా చాలా విపరీతంగా ఉన్నాయన్నారు. విద్యుత్ ప్లాంట్లతో ఒప్పందం పెద్ద స్కాంగా మారిందన్నారు. దేశ వ్యాప్తంగా ఒక మెగావాట్ ఉత్పత్తి చేస్తే రూ. 4 కోట్లు ఖర్చవుతుంటే, ఏపిలో మాత్రం ప్రభుత్వం ఒక మెగావాట్ ఉత్పత్తికి రూ. 6 కోట్లు ఖర్చయ్యే ప్రణాళికను ఆమోదించారన్నారు. రెండు విద్యుత్ ప్లాంట్లతో ఒప్పందం ద్వారా ప్రభుత్వ ఖజానాపై మోయలేని భారం పడిందన్నారు. ఈ ప్లాంట్ల నుంచి విద్యుత్ కొనుగోలుకు అన్ని రకాల మార్గదర్శకాలకు తిలోదకాలు ఇచ్చారన్నారు. ఎన్టీపిసి మార్గదర్శకాలను కూడా పక్కనపెట్టారన్నారు. ప్రభుత్వ చర్య వల్ల ఖజానాపై రూ. 2500 కోట్ల భారం పడుతుందన్నారు. ఈ విషయమై ప్రభుత్వం తక్షణమే పునరాలోచించి అదనపు విద్యుత్ ఉత్పత్తి చేసే ప్లాంట్ల నుంచి విద్యుత్ ఒప్పందాలను రద్దు చేయాలన్నారు.
ఎపిపిఎస్‌సి ద్వారానే
వర్శిటీ పోస్టుల భర్తీ
25న తుది దశ ఇంజనీరింగ్ అడ్మిషన్లు
మంత్రి గంటా శ్రీనివాసరావు వెల్లడి
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, జూలై 13: ఆంధ్రప్రదేశ్‌లోని పలు విశ్వవిద్యాలయాల్లో ఖాళీలను ఎపిపిఎస్‌సి ద్వారానే భర్తీ చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టు మానవ వనరుల మంత్రి గంటా శ్రీనివాసరావు బుధవారం సచివాలయంలో వెల్లడించారు. వర్శిటీలను బలోపేతం చేసేందుకు ఈ నిర్ణయం తీసుకుంటున్నట్టు చెప్పారు. అమిటీ, ఎస్‌ఆర్‌ఎం, నిట్, సెంచూరియన్, షిఫరీస్ అండ్ ఓషన్ ప్రైవేటు యూనివర్శిటీలకు క్యాబినెట్ ఆమోదం లభించిందని, ఈ విద్యాసంవత్సరం నుండి ఆయా వర్శిటీలు పని ప్రారంభిస్తాయని పేర్కొన్నారు. పిపిపి విధానంలో మరో ఆరు ప్రైవేటు యూనివర్శిటీలను ప్రారంభించడానికి క్యాబినెట్ సమ్మతించిందని , ఒంగోలు, శ్రీకాకుళం ట్రిపుల్ ఐటిలకు క్యాబినెట్ అనుమతి లభించిందని, 2016-17 విద్యాసంవత్సరానికి నోటిఫికేషన్లు జారీ చేస్తామని పేర్కొన్నారు. ఎంసెట్ తుది దశ అడ్మిషన్లను ఈ నెల 25న ప్రారంభిస్తామని, సీట్ల కేటాయింపు 27న జరుగుతుందని అన్నారు.
ఆంధ్రా ఎస్సెస్సీ అడ్వాన్స్‌డ్ ఫలితాలు నేడే
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, జూలై 13: ఆంధ్రప్రదేశ్ ఎస్సెస్సీ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ ఫలితాలను గురువారం నాడు హైదరాబాద్ సచివాలయంలో హెచ్‌ఆర్‌డి మంత్రి గంటా శ్రీనివాసరావు విడుదల చేస్తారని పరీక్షల సంచాలకుడు ఎం ఆర్ ప్రసన్నకుమార్ చెప్పారు. ఫలితాలను బిఎస్‌ఇఎపి డాట్ ఆర్గ్ వెబ్ సైట్‌తో పాటు ప్రైవేటు వెబ్‌సైట్లలో కూడా ఉంచుతామని ఆయన పేర్కొన్నారు.

25 నుండి కౌనె్సలింగ్
మెడికల్ , డెంటల్ సీట్లకు 1 నుండి వెబ్ ఆప్షన్లు, అడ్మిషన్లు
ఎమ్సెట్-1 ర్యాంకులతో ఆయుర్వేదం, యునాని సీట్లు
హెల్త్ యూనివర్శిటీ విసి డా.బి కరుణాకర్‌రెడ్డి
ఆంధ్రాలోనూ సర్ట్ఫికెట్ల పరిశీలన
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్,జూలై 13: తెలంగాణలోని ప్రభుత్వ, ప్రైవేటు మెడికల్, డెంటల్ కాలేజీల్లో ఎంబిబిఎస్, బిడిఎస్ కోర్సుల్లో అడ్మిషన్లకు ఈ నెల 25వ తేదీ నుండి కౌనె్సలింగ్ నిర్వహించనున్నట్టు కాళోజీ నారాయణరావు యూనివర్శిటీ ఆఫ్ హెల్త్ సైనె్సస్ వైస్ చాన్సలర్ డాక్టర్ బి కరుణాకర్‌రెడ్డి చెప్పారు. తెలంగాణలో జెఎన్‌టియు, ఉస్మానియా యూనివర్శిటీ, వరంగల్ కాకతీయ యూనివర్శిటీతో పాటు ఆంధ్రాలో విజయవాడ ఎన్‌టిఆర్ యుహెచ్‌ఎస్‌లో కూడా సర్ట్ఫికెట్ల పరిశీలన కేంద్రాలు ఏర్పాటు చేస్తామని ఆయన వెల్లడించారు. జనరల్ కేటగిరీకి 25వ తేదీ నుండి 29వ తేదీ వరకూ సర్ట్ఫికెట్ల పరిశీలన జరుగుతుందని, పిహెచ్, ఆర్మీ, స్పోర్ట్సు కేటగిరీ అభ్యర్థులకు మాత్రం ఈ నెల 30, 31లలో సర్ట్ఫికెట్ల పరిశీలన జరుగుతుందని పేర్కొన్నారు. ఆగస్టు మొదటి వారంలో అడ్మిషన్ల కౌనె్సలింగ్ జరపడానికి ఏర్పాట్లు చేస్తున్నట్టు ఆయన వెల్లడించారు. మొత్తం 3560 మెడికల్ సీట్లు, 1280 డెంటల్ సీట్లు అందుబాటులో ఉన్నాయని, త్వరలో మరికొన్ని సీట్లు పెరిగే అవకాశం లేకపోలేదని ఆయన చెప్పారు. వీటిలో 50శాతం కన్వీనర్ కోటా కింద భర్తీ చేస్తామని, మిగిలిన 50 శాతం సీట్లను నీట్-1, నీట్-2 ర్యాంకుల ద్వారా భర్తీ చేస్తారని వివరించారు. 1780 మెడికల్ సీట్లు, 640 డెంటల్ సీట్లను కన్వీనర్ కోటాలో భర్తీ చేస్తామని ఆయన వెల్లడించారు. ప్రభుత్వ కాలేజీల్లో 1060 మెడికల్, 140 డెంటల్ సీట్లు ఉన్నాయని, ప్రైవేటు కాలేజీల్లో 720 మెడికల్, 500 డెంటల్ సీట్లు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. తెలంగాణలో ఐదు ప్రభుత్వ మెడికల్ కాలేజీలు, 15 ప్రైవేటు మెడికల్ కాలేజీలు, ఒక ప్రభుత్వ డెంటల్ కాలేజీ, మరో 9 ప్రైవేటు డెంటల్ కాలేజీలున్నాయని చెప్పారు.