ఆంధ్రప్రదేశ్‌

వాహనాల అక్రమ రిజిస్ట్రేషన్‌పై సమగ్ర విచారణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మంగళగిరి, జూలై 14: షోరూంకే రాని వాహనాలను గుంటూరు జిల్లా మంగళగిరిలోని మోటారు వాహన ఇన్‌స్పెక్టర్ శివనాగేశ్వరరావు అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసిన అంశం వెలుగు చూడటంతో ప్రభుత్వం సమగ్ర విచారణకు ఆదేశించినట్లు తెలిసింది. 27 సరుకు రవాణా వాహనాలకు రిజిస్ట్రేషన్ చేసినట్లు తేలింది. కంపెనీ నుంచి వాహనాలు డీలర్ వద్దకే రాకపోగా ఆ వాహనాలను తాము కొనుగోలు చేసినట్లు నలుగురు వ్యక్తులు రిజిస్ట్రేషన్ చేయించుకున్నట్లు చెబుతున్నారు. మంగళగిరి పట్టణంలోని కృష్ణమోహన్ అనే వ్యక్తి ఇంటి నెంబరు చిరునామాగా చూపి ఈ అక్రమ వ్యవహారం జరిపినట్లు సమాచారం. కృష్ణమోహన్ ఇల్లు అద్దెకు తీసుకున్న కొందరు వాహనాల రిజిస్ట్రేషన్ చే యించుకున్నారని, ఇప్పుడా వ్యక్తులు అదృశ్యమయ్యారని రవాణాశాఖ వర్గాలు చెబుతున్నాయి. వాహనాలు రిజిస్ట్రేషన్ చేసిన ఎంవిఐ శివనాగేశ్వరరావును దీర్ఘకాల సెలవులోకి పంపారని, సస్పెండ్ చేశారని రకరకాల కథనాలు విన్పిస్తున్నాయి. మంగళగిరి ఎంవిఐగా గుంటూరుకు చెందిన అధికారి బాలకృష్ణ ఇన్‌చార్జ్ బాధ్యతలు తీసుకున్నారు. ఈ కుంభకోణం వెనుక ఇద్దరు మంత్రుల హస్తం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. మంత్రుల ఒత్తిడి కారణంగానే వాహనాలను రిజిస్ట్రేషన్ చేయడానికి ఎంవిఐ సాహసించారని సమాచారం. ఈ వ్యవహారం వెనుక ఎవరిపాత్ర ఏమిటో విచారణ జరపాలని రవాణాశాఖామంత్రి శిద్దా రాఘవరావు ఆదేశించారు. వాహనాలు కొన్న యజమానులకు ఎవరెవరు సహకరించారో ఆరా తీస్తున్నారు. రవాణాశాఖ కమిషనర్ బాలసుబ్రహ్మణ్యం ఆదేశాల మేరకు డెప్యూటీ కమిషనర్ రాజారత్నం రంగంలోకి దిగి విచారణ ప్రారంభించినట్లు తెలిసింది. కంపెనీ నుంచి బైటికి రాని వాహనాలను రిజిస్ట్రేషన్ చేయించడం ఏం ఆశించి చేశారా అని ఆరా తీస్తున్నారు.