ఆంధ్రప్రదేశ్‌

స్వస్థలాలకు చేరుకుంటున్న అమర్‌నాథ్ యాత్రికులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూలై 14: జమ్ము, కాశ్మీర్ అల్లర్లలో చిక్కుకున్న ఆంధ్రప్రదేశ్ యాత్రికులు క్షేమంగా వారి గమ్యస్థానాలను చేరుకుంటున్నారు. జమ్ము, కాశ్మీర్‌లో అమర్‌నాథ్ యాత్రకు వచ్చిన 118 మంది ఒంగోలు యాత్రికులు, 15 మంది అనంతపురం వాస్తవ్యులు, 52 మంది వైజాగ్ యాత్రికులు, 46 మంది నెల్లూరు యాత్రికులు వారి వారి గమ్యస్థానాలను చేరుకుంటున్నుట్ల సమాచారమందిందని ఢిల్లీలో ఎపి భవన్ అదనపు రెసిడెంట్ కమిషనర్ ఆర్జ్యా శ్రీకాంత్ తెలిపారు. జమ్మూ నుంచి నేరుగా వారి గమ్యస్థానాలకు 220 మంది బయల్దేరినట్లు పేర్కొన్నారు. నరసరావుపేటకు చెందిన 82 మంది యాత్రికులు ఢిల్లీలో ఉన్నారు. గురువారం సాయంత్రం వారు బయల్దేరి వెళ్తారు. సోనా మార్గ్‌లో ఉన్న మరో 46 మంది ఢిల్లీ చేరుకుంటారు. మరో 112 మంది ప్రయాణికులు శ్రీనగర్‌లో ఉండగా, మరో 100 మంది బల్తాల్ వద్ద, పహల్గామ్ వద్ద మరో 22 మంది యాత్రికులు జమ్ము చేరుకునేందుకు సిద్ధంగా ఉన్నారు. జమ్ము, కశ్మీర్‌లో ఉన్న రాష్ట్రానికి చెందిన అమర్‌నాథ్ యాత్రికులందరినీ క్షేమంగా రాష్ట్రానికి పంపించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు శ్రీకాంత్ వెల్లడించారు. ఈ సందర్భంగా అల్లర్ల సమయంలో ఎంతో ఆందోళనకు గురైన తమకు రాష్ట్ర ప్రభుత్వం సరైన సమయంలో సహాయక చర్యలు చేపట్టిందని, జమ్ము నుంచి ఢిల్లీ చేరుకోడానికి సహకారమందించారని యాత్రికులు పేర్కొన్నారు.