ఆంధ్రప్రదేశ్‌

దక్షిణాది రాష్ట్రాలను అస్థిరపర్చడానికి బీజేపీ కుట్ర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, నవంబర్ 8: దక్షిణాది రాష్ట్రాలను అస్థిరపర్చడానికి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కుట్ర రాజకీయాలు నడుపుతోందని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఛైర్మన్ కారెం శివాజీ ఆరోపించారు. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో గురువారం ఆయన విలేఖర్లతో మాట్లాడారు. దక్షిణాది రాష్ట్రాల ప్రభుత్వాలను కూల్చడానికి బీజేపీ ప్రయత్నిస్తోందన్నారు. పవన్, జగన్ బీజేపీ డైరెక్షన్‌లోనే నడుస్తున్నారన్నారు. కుల మతాలు లేవని చెబుతూనే కులాలను అడ్డుపెట్టుకుని చిచ్చుపెట్టడానికి చేస్తున్న ప్రయత్నాలను ప్రజలు గమనిస్తున్నారన్నారు. ప్రత్యేక హోదా ఇస్తారని చెప్పడంవల్ల కాంగ్రెస్‌తో టీడీపీ చెలిమిని ప్రజలను స్వీకరించారన్నారు. ప్రత్యేక హోదా హామీని నెరవేర్చుతామని కాంగ్రెస్ ఇప్పటికే ప్రకటించిందన్నారు. జగన్ కోడి కత్తి రాజకీయాలు ఆడుతున్నారని, ఒక ఎస్సీ యువకుడి భవిష్యత్‌ను పణంగా పెట్టి, రాజకీయ ప్రయోజనం పొందాలని చూస్తున్నారని ఆరోపించారు. పవన్ కళ్యాణ్‌కు ఏ విషయం మీదా అవగాహన లేదన్నారు. ఇటీవల విశాఖలో పవన్, వైసీపీ నేతల మధ్య పొత్తు, సీట్ల పంపకంపై చర్చలు జరిగినట్టు తెలిసిందని శివాజీ తెలిపారు. పవన్, జగన్ ఏకమై బీజేపీ డైరెక్షన్‌లో టీడీపీ ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. కేంద్రం విభజన హామీల్లో ఏ ఒక్కటీ నెరవేర్చలేదన్నారు. ప్రజలు ఇదంతా గమనిస్తున్నారన్నారు. ఏపీ ప్రజలపై ప్రధాని మోదీ కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు.