ఆంధ్రప్రదేశ్‌

నా సచ్ఛీలత నిరూపితమైంది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, విశాఖ భూ కుంభకోణం విషయంలో సొంత, విపక్ష పార్టీల నుంచి నాపై వచ్చిన ఆరోపణలకు సిట్ నివేదిక స్పష్టమైన జవాబునిచ్చిందని మానవ వనరుల మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. విశాఖలో ప్రభుత్వ అతిధిగృహంలో గురువారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తనపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో సమగ్ర విచారణ కోరుతూ చేసిన అభ్యర్ధన మేరకే సిట్ ఏర్పాటైందన్నారు. విశాఖ భూ కుంభకోణం విమర్శలపై గతేడాది జూన్ 6న తాను ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి సిబీఐ లేదా మరో దర్యాప్తు సంస్థతో విచారణ జరిపించాలని కోరినట్టు తెలిపారు. దీనికి సీఎం స్పందించిన సీఎం అదే నెల 16న వినీత్ బ్రిజ్‌లాల్ నేతృత్వంలో సిట్ ఏర్పాటు చేస్తూ ఆదేశాలు జారీ చేయగా, 28 నుంచి సిట్ దర్యాప్తు ప్రారంభమైందన్నారు. సిట్ ఎదుటకు 2,875 ఫిర్యాదులు రాగా, 333 వ్యక్తిగత ఫిర్యాదులు అందాయన్నారు. 11 మంది రాజకీయ ప్రతినిధులు కూడా సిట్‌ను కలిసి ఫిర్యాదులు అందించారన్నారు. దాదాపు 1.2 లక్షల డాక్యుమెంట్లను పరిశీలించిందన్నారు. దీనిలో పలువురు ఐఏఎస్ అధికారులు సహా ఆర్డీఓలు, తహశీల్దార్లు, ఇతర రెవెన్యూ అధికారులు సహా పలువురు రాజకీయ నాయకుల ప్రమేయం పై సిట్ స్పష్టమైన సూచనలు చేసిందన్నారు. ఎవరిపై ఎటువంటి చర్యలు తీసుకోవాలన్న అంశాన్ని ఖరారు చేసేందుకు న్యాయ, రెవెన్యూ, సాధారణ పరిపాలన ఉన్నతాధికారులతో కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసిందన్నారు. అప్పటి వరకూ తనపై తీవ్ర ఆరోపణలు చేసిన వారికి సిట్ నివేదిక చెంపపెట్టు వంటిదన్నారు. కేవలం తన రాజకీయ ఎదుగుదలను సహించలేకే భూ కుంభకోణంతో బురదజల్లే ప్రయత్నం చేశారన్నారు. 1999లో తాను రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకూ రెండు దశాబ్ధాల్లో తన ఆస్తులపై బహిరంగంగా ఎవరైనా విచారణ జరిపించుకోవచ్చని ఈ సందర్భంగా మంత్రి గంటా సవాలు చేశారు. సిట్ దర్యాప్తును ప్రభుత్వం ప్రభావితం చేసిందన్న ఆరోపణలను ఆయన తోసిపుచ్చారు.
జగన్, పవన్‌లకు ఓట్లడిగే హక్కులేదు
రాష్ట్రానికి తీరని అన్యాయం చేస్తూ ప్రజాస్వామ్య వ్యవస్థలన్నింటినీ భ్రష్ఠుపట్టిస్తున్న బీజేపీ సర్కారు, ప్రధాని నరేంద్ర మోదీని నిలదీయని వైసీపీ అధినేత జగన్, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌లకు ఓట్లడిగే హక్కులేదని మంత్రి గంటా స్పష్టం చేశారు. కడప ఉక్కు పరిశ్రమతో పాటు విశాఖ మెట్రో ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వమే చేపట్టేందుకు సిద్ధంగా ఉందన్నారు. విభజన చట్టాన్ని అమలు చేయకుండా, పార్లమెంట్‌లో అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ హామీలు విస్మరించిన ప్రధాని మోదీపై విపక్ష నేత వౌనం వహించడం వెనుక ఆంతర్యమేమిటన్నారు. సీబీఐ, ఐటీ, గవర్నర్ వ్యవస్థలను నిర్వీర్యం చేస్తున్న మోదీ ప్రభుత్వ గ్రాఫ్ పడిపోతోందని, అందుకు ఇప్పటి వరకూ జరిగిన ఉపఎన్నికలే నిదర్శనమన్నారు. నాలుగున్నరేళ్లలో 30 లోక్‌సభ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ కేవలం ఆరు స్థానాల్లో గెలిచిందని, ఆ పార్టీ సిట్టింగ్ స్థానాలను సైతం కోల్పోయిందని గుర్తుచేశారు. దేశంలోని బీజేపీయేతర పార్టీలన్నింటినీ ఒకే తాటిపైకి తెచ్చి మోదీని గద్దెదింపేందుకు చంద్రబాబు కృషి చేస్తున్నారన్నారు.