ఆంధ్రప్రదేశ్‌

విభజన హామీల అమలుకు ఉద్యమం ఉద్ధృతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, నవంబర్ 10: పార్లమెంట్ సాక్షిగా ప్రధానమంత్రి 2014లో ఇచ్చిన విభజన వాగ్దానాలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ పోరాటాలను ఉద్ధృతం చేయాలని నిర్ణయించినట్లు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ చెప్పారు. శనివారం తిరుపతిలోని పార్టీకార్యాలయంలో విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ డిసెంబర్ నెలలో జరిగే చివరి పార్లమెంట్ సమావేశాల్లో ఏపీకి ఇచ్చిన హామీలు అమలు చేస్తామని కేంద్రం ప్రకటించాలని లేకుంటే ఢిల్లీలో పోరాటాన్ని తీవ్రతరం చేస్తామన్నారు. విభజన హామీల అమలుకు రాష్ట్రంలో పెద్దఎత్తున ఉద్యమాలు జరుగుతున్నా కేంద్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందన్నారు. మోదీ నిరంకుశ వైఖరితో రాష్ట్రానికి తీరని ద్రోహం చేశారని ఆయన విమర్శించారు. నాలుగేళ్లు బీజేపీతో కలిసి కాపురం చేసిన బాబు, నేడు బీజేపీకి వ్యతిరేక శక్తులను కూడగడుతున్నానని తిరగడం హాస్యాస్పదమన్నారు. రానున్న ఎన్నికల్లో టీడీపీ, వైకాపాలకు వ్యతిరేకంగా సీపీఐ, సీపీఎం, జనసేన, ఆమ్ ఆద్మీ, లోక్‌సత్తా పార్టీలు కలిసివచ్చే పార్టీలతో కలిసి పనిచేస్తామని ఆయన స్పష్టం చేశారు.