ఆంధ్రప్రదేశ్‌

రూ. 872 కోట్లతో భూ రికార్డుల పరిరక్షణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు సిటీ, జూలై 14: రాష్ట్రంలో భూములకు సంబంధించిన రికార్డుల పరిరక్షణకు రూ. 872కోట్లు కేటాయించామని ఉప ముఖ్యమంత్రి కెఇ కృష్ణమూర్తి తెలిపారు. కర్నూలు నగరంలోని ప్రభుత్వ అతిథి గృహంలో గురువారం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ భూముల రీ సర్వే చేయించి వాటికి సంబంధించిన రికార్డులను భద్రపరుస్తామన్నారు. అందుకోసం మొదటి విడతగా 384 డేటాబేస్ సెంటర్లు, రెండవ విడతగా 452 సెంటర్లు ఏర్పాటు చేశామన్నారు. విశాఖ, అనంతపురం, కర్నూలు జిల్లాల్లో ఒక్కో గ్రామాన్ని పైలెట్ ప్రాజెక్టు కింద తీసుకుని రీ సర్వే చేపట్టామన్నారు. అందులో భాగంగా కర్నూలు జిల్లాలో దేవమడ గ్రామం, విశాఖ జిల్లాలో మామిడిపాలెం, అనంతపురం జిల్లాలో జంబులదినె్న గ్రామాల్లో రీ సర్వే చేపట్టామన్నారు. ఈ విధానంలో కొన్ని సెంట్ల తేడా మాత్రమే వస్తుందన్నారు. ఒక సర్వే నెంబర్‌లోని భూమిని కొలిచినప్పుడు ఈ విధంగా సెంట్లలో తేడా వస్తుందని ఆయన వివరించారు.