ఆంధ్రప్రదేశ్‌

ఎస్సీ ఎస్టీలకూ ఎన్టీఆర్ విద్యోన్నతి పథకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ, జూలై 14: ఆంధ్రప్రదేశ్‌లో దళిత, గిరిజన వర్గాల విద్యార్థులకు సైతం ప్రభుత్వం ఎన్టీఆర్ విద్యోన్నతి పథకాన్ని అమలుచేయాలని సంకల్పించింది. కాపు, బిసి వర్గాలకు ఇటీవల ఈ పథకాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే. అయితే ఏ ఒక్క వర్గాన్నీ దూరం చేసుకోరాదన్న యోచనతో, అందరికీ సమ ప్రాధాన్యత ఇస్తున్నట్టుగా సంకేతాలు పంపే పనిలో ప్రభుత్వం ఉంది. తాజాగా ఎస్సీ ఎస్టీలకు ఎన్టీఆర్ విద్యోన్నతి పథకాన్ని అమలుచేస్తోంది. ఈ పథకం కింద రాష్ట్రంలో దళిత వర్గానికి చెందిన 700 మంది, గిరిజన వర్గానికి చెందిన 300 మందిని ఎన్టీఆర్ విద్యోన్నతి పథకం కింద ఎంపిక చేసి సివిల్ సర్వీస్ పరీక్షలకు ఉచిత శిక్షణ ఇవ్వనున్నారు. ఉచిత శిక్షణకు అభ్యర్థులను ఎంపిక చేసేందుకు కాకినాడ జెఎన్‌టియులో 2016 ఆగస్టు 21వ తేదీన ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించి దరఖాస్తులను అభ్యర్థులు ఆన్‌లైన్‌లో మాత్రమే దాఖలు చేసుకునే వీలుంది. డబ్ల్యుడబ్ల్యుడబ్ల్యు ఎన్టీఆర్‌విద్యోన్నతి.ఒఆర్‌జి ద్వారా ఈనెల 16వ తేదీ నుండి అభ్యర్థులు దరఖాస్తులు దాఖలు చేసుకోవచ్చని పరీక్షల కన్వీనర్ డాక్టర్ సమయమంతుల శ్రీనివాసకుమార్ చెప్పారు.