ఆంధ్రప్రదేశ్‌

ఏడు ప్రముఖ దేవాలయాల్లో విద్యుత్ ఆదా పథకాల అమలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 14: రాష్ట్రంలో ఏడు ప్రముఖ దేవాలయాల్లో కూడా విద్యుత్ ఆదా కోసం ఎనర్జీ ఎఫిషియెంట్ ఎండోమెంట్స్ ప్రాజెక్టు స్కీంను అమలు చేయాలని ఏపి ట్రాన్స్‌కో నిర్ణయించింది. దీని వల్ల సాలీనా 60 లక్షల విద్యుత్ యూనిట్లను పొదుపు చేయవచ్చని ఇంధన శాఖ కార్యదర్శి అజయ్ జైన్ తెలిపారు. ఈ ప్రాజెక్టు అమలు కోసం ఆయన రాష్ట్ర రెవెన్యూ ఎండోమెంట్స్ శాఖ ముఖ్య కార్యదర్శి జెఎస్‌వి ప్రసాద్‌తో సమావేశమై విధి విధానాలను ఖరారు చేశారు. రాష్ట్రంలో శ్రీశైలం, కనకదుర్గ దేవాలయం, శ్రీకాళహస్తి, కాణిపాకం, ద్వారకా తిరుమల, సింహాచలం, అన్నవరం దేవాలయాలను ఎంపిక చేశారు. ఈ దేశాల్లో విద్యుత్ పొదుపు వల్ల సాలీనా 200 టన్నుల ఎల్‌పిజి ఇంధనాన్ని పొదుపుచేయవచ్చునని అజయ్ జైన్ తెలిపారు. దేవాలయాల్లో విద్యుత్ పొదుపు స్కీం నివేదికను ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు నివేదించినట్లు ఆయన చెప్పారు. ఈ నెల 15వ తేదీన దేవాదాయ శాఖ మంత్రి మాణిక్యాలరావు ఈ అంశంపై ఒక సమీక్ష సమావేశాన్ని విజయవాడలో ఏర్పాటు చేయనున్నారు.