ఆంధ్రప్రదేశ్‌

ఉక్కు ఫ్యాక్టరీ కోసం నినదించిన ప్రొద్దుటూరువాసులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రొద్దుటూరు టౌన్, జూలై 14: కడప జిల్లాలో ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటుచేయాలంటూ గురువారం ప్రొద్దుటూరు పట్టణంలో భారీ ర్యాలీ, సభ నిర్వహించారు. విద్యార్థులు, వివిధ ప్రజాసంఘాలు, స్వచ్ఛంద సంస్థలు కలిసి ఉక్కు పరిశ్రమ సాధన సమితి ఆధ్వర్యంలో పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం పట్టణంలోని పుట్టపర్తి సర్కిల్‌లో బహిరంగసభ నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ ఉక్కు పరిశ్రమ ఏర్పాటుపై ప్రభుత్వం జిల్లాకు రిక్తహస్తం చూపుతోందని ధ్వజమెత్తారు. ఎన్నికలకు ముందు ఉక్కు పరిశ్రమపై ఇచ్చిన హామీని బాబు పెడచెవిన పెట్టారన్నారు. ఇక్కడ ఉక్కు పరిశ్రమ ద్వారా జిల్లాలో ప్రత్యక్ష్యంగా లక్షమందికి, పరోక్షంగా రెండు లక్షల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. జిల్లా వాసులంతా కలసికట్టుగా ఉక్కు పరిశ్రమ సాధనకు పోరుబాట పట్టాలని పిలుపునిచ్చారు. అనంతరం ఉక్కు పరిశ్రమ సాధించేంతవరకు విశ్రమించమంటూ ప్రజలంతా ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమంలో ఉక్కు పరిశ్రమ సాధన సమితి అధ్యక్షుడు ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, ఆర్యవైశ్య సభ అధ్యక్షుడు రామ్మోహన్, రచయిత జింకా సుబ్రహ్మణ్యం, దళిత నాయకులు తదితరులు పాల్గొన్నారు.

చిత్రం.. ఉక్కు పరిశ్రమ సాధన కోసం కడప జిల్లా ప్రొద్దుటూరులో ఆందోళన చేస్తున్న జనం