ఆంధ్రప్రదేశ్‌

తోటపల్లి నీరు విడుదల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పార్వతీపురం, జూలై 14: సర్దార్ గౌతులచ్చన్న బ్యారేజి ప్రాజెక్టు (తోటపల్లి రిజర్వాయర్ ) ద్వారా లక్ష ఎకరాలకు సాగునీరందించే కార్యక్రమాన్ని గురువారం రాష్ట్ర నీటి పారుదల శాఖామంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ప్రారంభించారు. గురువారం ప్రాజెక్టు పరిధిలోని ఉల్లిభద్ర వద్ద ప్రాజెక్టు కుడి ప్రధాన కాలువ నుంచి స్విచ్ ఆన్ చేసి మంత్రి నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా మంత్రి దేవినేని మాట్లాడుతూ 2017 నాటికి వంశధార ప్రాజెక్టును పూర్తి చేసి నాగావళి నదికి అనుసంధానం చేస్తామన్నారు. వంశధార నిర్వాసితుల కోసం ఇప్పటికే 424 కోట్ల రూపాయలు విడుదల చేశామన్నారు. నారాయణపురం ఆనకట్టను కూడా త్వరగా పూర్తి చేయడానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. రాష్ట్ర మంత్రులు డాక్టర్ కిమిడి మృణాళిని, కింజరాపు అచ్చెన్నాయుడు, శ్రీకాకుళం ఎంపి కింజరాపు రామ్మోహన్ నాయుడు, మాజీ మంత్రులు పతివాడ నారాయణ స్వామినాయుడు, గౌతు శ్యామసుందర శివాజి, ఎమ్మెల్సీలు ద్వారపురెడ్డి జగదీశ్వరరావు, గాదె శ్రీనివాసులనాయుడు, గుమ్మడి సంధ్యారాణి, ఎమ్మెల్యే బొబ్బిలి చిరంజీవులు, సుజయకృష్ణరంగారావు, శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ లక్ష్మీనృసింల, ఇరిగేషన్‌శాఖ ప్రాజెక్టుల సలహాదారులు ఐఎస్‌ఎన్ రాజు, నార్త్ కోస్ట్ సిఇ శివరామకృష్ణ, తోటపల్లి ప్రాజెక్టు ఇఇ హెచ్ హనుమంతరావు, రామచంద్రరావు, ఇరిగేషన్ ఇఇలు పాల్గొన్నారు.

చిత్రం.. నీరు విడుదలకు స్విచ్ ఆన్ చేస్తున్న మంత్రులు దేవినేని, మృణాళిని